BigTV English

MS Dhoni : సాక్షికి ఇంత పొగరా… ధోనితో కాళ్లు మొక్కించుకొని మరీ!

MS Dhoni : సాక్షికి ఇంత పొగరా… ధోనితో కాళ్లు మొక్కించుకొని మరీ!

MS Dhoni :  టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో నిత్యం ఏదో ఒక అంశం పై వార్తల్లో నిలుస్తున్నారు ధోనీ. ఇటీవలే ధోనీ తన భార్య సాక్షి, కూతురు తో కలిసి రాంచీకి సమీపంలో ఉన్న ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. పూజల నేపథ్యంలో పలువురు ధోనీ కొడుకు పుట్టాలని పూజలు నిర్వహించాడని ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి ఫ్యామిలీ కి సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ధోనీ భార్య సాక్షికి ఎంత పొగర్రా బాబు.. ధోనీతో తన  షూ లేస్ కట్టించుకుంటుంది. ధోనీ భార్యకి కనీసం షూ లేస్ కూడా వేసుకునే తీరిక లేదా..? ధోనీ ని బ్రతిమిలాడి మరీ ఇలా చేస్తుందా..? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


Also Read : Team India Injury: టీమిండియాకు బిగ్ షాక్.. నలుగురు ప్లేయర్లకు గాయాలు.. ఇంగ్లాండ్ నుంచి ఇంటికి రిటర్న్.. ఒంటరిపోయిన గిల్!

క్రికెట్ లో.. వికెట్ కీపర్ గా.. 


ధోనీ రాంచీకి సమీపంలో ఉన్న దేవరీ మందిర్ ను తన కుటుంబంతో కలిసి సందర్శించాడు. రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలో ఢ్యూరీ అనే గ్రామంలో ఉన్న ఆలయంలో ప్రార్థనలు చేశాడు. ఈ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారికి 16 చేతులు ఉండటం ఓ ప్రత్యేకత. ఈ ఆలయం దాదాపు 700 సంవత్సరాల పురాతనమైనదని చెబుతుంటారు. ఈ ఆలయంలో గిరిజన పూజారులు,  బ్రాహ్మణులు కలిసి పూజలు జరుపుతారు. ప్రధాన క్రికెట్ టోర్నమెంట్ కి ముందు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లకి ముందు ఇదివరకు చాలా సార్లు ఈ ఆలయాన్ని సందర్శించాడు ధోనీ. ఇక ఈ సారి కొడుకు పుట్టాలని ధోనీ తన కుటుంబ సభ్యులతో కలిసి రహస్యంగా పూజలు చేసినట్టు తెలుస్తోంది. ధోనీ టీమిండియా క్రికెట్ లోకి రాకముందు రైల్వే లో టికెట్ కలెక్టర్ గా విదులు నిర్వహించాడు. అనంతరం ఫుట్ బాల్ గోల్ కీపర్ గా తొలుత ఆడాడట. అటు నుంచి క్రికెట్ లోకి మారి.. వికెట్ కీపర్ గా అద్భుతంగా రాణించాడు.

ధోనీ-సాక్షి వీడియో వైరల్ 

రాహుల్ ద్రవిడ్ తరువాత వికెట్ కీపర్లలో దినేష్ కార్తిక్, మహేంద్ర సింగ్ ధోనీ ఇద్దరూ పోటీ పడగా.. ఆ సమయంలో టీమిండియా కెప్టెన్ గా గంగూలీ ఉన్న సమయంలో వీరిద్దరిలో ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐ అడగ్గా.. ఒక్క సారి ధోనీకి ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పారు. అలా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని..టీమిండియా కెప్టెన్ గా అద్భుతంగా రాణించాడు ధోనీ. తన కెప్టెన్సీ టీ-20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ షిప్ టైటిళ్లను సాధించింది టీమిండియా. టీమిండియా అన్ని ఫార్మాట్లలో టైటిల్ సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీనే కావడం విశేషం. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ చెప్పేసిన ధోనీ.. తనకు నచ్చిన జీవితాన్ని గడుపుతున్నాడు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. మిగతా ఏ రంగం క్రికెట్ కూడా ఆడటం లేదు ధోనీ. ప్రస్తుతం ధోనీ-సాక్షి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Dunith Wellalage’s father : శ్రీలంక జ‌ట్టులో విషాదం..ఆఫ్ఘ‌న్ తో మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే గుండెపోటుతో మృతి

AFG Vs SL : ఆసియా క‌ప్ లో శ్రీలంక ఘ‌న విజ‌యం.. అప్గాన్ ఔట్..!

RCB : వీడురా RCB ఫ్యాన్ అంటే… ప్లేయర్లందరి పేరు రాసుకున్నాడు

IPL 2026 : RCB నుంచి కోట్లల్లో ఆఫర్… కానీ ఛీ కొట్టిన CSK ప్లేయర్ ?

Fastest Fifty : ఎవ‌డ్రా వీడు…13 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ.. జస్ట్ మిస్‌… యువీ రికార్డ్ గంగ‌లో క‌లిసేది !

AFG Vs SL : టాస్ గెలిచిన అప్గాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రంటే..?

Asia Cup 2025 : ఆసియా క‌ప్ లో హ్యాండ్ షేక్ వివాదానికి కార‌ణం అత‌డేనా..?

Asia Cup 2025 : పాకిస్తాన్ ను గడగడలాడించిన UAE ప్లేయర్.. ఇండియా నుంచి వెళ్లి… నరకం చూపించాడు

Big Stories

×