Hari Hara Veeramallu: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ సినిమా మీద మొదట అనౌన్స్ చేసినప్పుడు బీభత్సమైన అంచనాలు ఉండేవి. అని ఈ సినిమా లేట్ అవుతున్నకొద్దీ పవన్ కళ్యాణ్ ఆడియన్స్ కూడా నీరసపడిపోయారు. అయితే ఈ సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత కొంతమందికి అంచనాలు మళ్లీ పెరిగాయి.
ఈ సినిమా గురించి నిర్మాత ఏఎం రత్నం ఏ ఇంటర్వ్యూలో కనిపించినా కూడా ఎలివేషన్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా ఎన్నో కష్టాలు ఎదురు చూశారు. వాళ్లకు ఒక రేట్ చెప్పడం ఆ రేటు కాకుండా డిస్టిబ్యూటర్స్ వేరే రేట్ అడగటం. ఇలాంటివి ఎన్నో ఈ సినిమా విషయంలో జరిగాయి. తనకు అన్నీ దాటుకుని ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమైంది.
అదిరిపోయే గుడ్ న్యూస్
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే బుక్ మై షోస్ లాంటి యాప్స్ లేని రోజుల్లో రేపు సినిమా రిలీజ్ అయితే ఈరోజు ముందు నుంచే టికెట్ కౌంటర్లో నిలుచున్నవాళ్ళు. అత్తారింటికి దారేది టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉండబోతుంది ఆ సినిమా వలన అంటూ జాగ్రత్తలు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలు గురించి యుఎస్ లో టాక్ విని తెలుసుకునేవాళ్ళు. ఇక హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ అవుతుంది. కానీ దానికంటే ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ 23 వ తారీఖున వేస్తున్నట్లు తెలుస్తుంది. దీని గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే జరిగినట్లయితే సినిమా రిజల్ట్ గురించి ప్రత్యేకంగా ఎవర్నో అడగాల్సిన పనిలేదు మనమే ప్రత్యేకంగా సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి
ఈ సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన నిధి అగర్వాల్ విపరీతంగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంది. దాదాపు 12 గంటల పాటు కష్టపడి 15 పైగా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూనే వచ్చింది. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకి మొదటి దర్శకత్వం వహించారు. కారణాల వలన ఆయన తప్పుకోవడంతో నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దీనిని ఫినిష్ చేశారు. అయితే జ్యోతి వర్క్ ఫై కూడా పవన్ కళ్యాణ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో జులై 23న తెలిసిపోతుంది.
Also Read: MEGA157 : ఆ వీడియోలు షేర్ చేస్తే జైలుకు వెళ్లడం ఖాయం, మెగా మాస్ వార్నింగ్