Most Popular Celebrities 2025:ప్రతినెల ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక ప్రజాదారణ పొందిన నటీనటుల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే జూన్ 2025 కి సంబంధించి పాపులర్ నటీనటుల జాబితాను కూడా ఈ మీడియా సంస్థ విడుదల చేసింది. ఈ లిస్టులో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో, నటనతో సత్తా చాటుతూ అత్యధిక ప్రజాదారణ పొందిన హీరోలు, హీరోయిన్లు లిస్ట్ చేయబడ్డారు. మరి ఈ జాబితాలో మీ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ స్థానం సంపాదించుకున్నారా..? ఒకవేళ స్థానం లభించి ఉంటే ఏ స్థానంలో నిలిచారో? ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక ప్రజాదారణ పొందిన హీరో..
2025 జూన్ నెలకు సంబంధించి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక ప్రజాదారణ పొందిన హీరోలలో 10 మందిని ఆర్మాక్స్ మీడియా సంస్థ ఫైనలైజ్ చేయగా.. ఆ లిస్టులో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మరొకసారి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక రెండవ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathi) నిలిచారు. ఇక మూడవ స్థానంలో అల్లు అర్జున్(Allu Arjun), నాలుగవ స్థానంలో షారుఖ్ ఖాన్(Shahrukh Khan), ఐదవ స్థానంలో అజిత్ కుమార్(Ajith), ఆరవ స్థానంలో మహేష్ బాబు(Maheshbabu), ఏడవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), 8వ స్థానంలో రామ్ చరణ్(Ram Charan), తొమ్మిదవ స్థానంలో అక్షయ్ కుమార్(Akshay Kumar), పదవ స్థానంలో నాని (Nani)నిలిచారు. ఇక వీరంతా కూడా తమ నుంచీ రాబోయే లేదా ఆల్రెడీ వచ్చిన చిత్రాలతోనే పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
Ormax Stars India Loves: Most popular male film stars in India (Jun 2025) #OrmaxSIL pic.twitter.com/Z6Du6wjyLo
— Ormax Media (@OrmaxMedia) July 18, 2025
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక ప్రజాదారణ పొందిన హీరోయిన్లు..
ఇకపోతే ఈ ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ హీరోల జాబితానే కాదు హీరోయిన్ల జాబితాని కూడా బయటకు తీస్తూ ఉంటుంది. మరి అలా 2025 జూన్ నెలకు సంబంధించి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక ప్రజాదారణ పొందిన హీరోయిన్లలో ఎవరు ఏ స్థానంలో నిలిచారు? టాప్ టెన్ లిస్టులో ఎవరు స్థానం సంపాదించుకున్నారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో సమంత (Samantha) నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. గత కొన్ని రోజులగా ఈమె సినిమాలు ఏవీ చేయకపోయినా.. సమంత నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఇక బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt)రెండవ స్థానం, దీపిక పదుకొనే (Deepika Padukone)మూడవ స్థానం, త్రిష కృష్ణన్ (trisha Krishnan)నాలుగవ స్థానం , కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) ఐదవ స్థానం, సాయి పల్లవి(Sai Pallavi) ఆరవ స్థానం, నయనతార (Nayanthara) ఏడవ స్థానం, రష్మిక మందన్న (Rashmika mandanna) ఎనిమిదవ స్థానం , కీర్తి సురేష్ (Keerthy Suresh) 9వ స్థానంలో నిలవగా.. ఇక చిట్టచివరి పదవ స్థానంలో తమన్నా భాటియా (Tamannaah Bhatia) నిలిచారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ల జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ormax Stars India Loves: Most popular female film stars in India (Jun 2025) #OrmaxSIL pic.twitter.com/gRGPa6TBXI
— Ormax Media (@OrmaxMedia) July 18, 2025