BigTV English

MEGA157 : ఆ వీడియోలు షేర్ చేస్తే జైలుకు వెళ్లడం ఖాయం, మెగా మాస్ వార్నింగ్

MEGA157 : ఆ వీడియోలు షేర్ చేస్తే జైలుకు వెళ్లడం ఖాయం, మెగా మాస్ వార్నింగ్

MEGA157 : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరియర్ లో వస్తున్న 157వ సినిమా ఇది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీని కారణం రీసెంట్ టైమ్స్ లో మెగాస్టార్ కామెడీ చేసి చాలా రోజులైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఎంటర్టైన్మెంట్ వేలో కనిపిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.


అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పటాస్ సినిమా దగ్గరనుంచి మొదలుపడితే మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు అతని స్ట్రెంత్ కామెడీ. ఒక మంచి పాయింట్ పట్టుకొని దానిని వినోదభరితంగా ఎలా చెప్పాలి అనే విషయంలో అనిల్ రావిపూడి పీహెచ్డీ చేశాడు అనుకోవచ్చు. దీనికి బాక్స్ ఆఫీస్ వద్ద అతని సినిమాకు వస్తున్న కలెక్షన్స్ నిదర్శనం.

వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు 


మెగా 157 సెట్‌ నుండి అనాఫిషియల్ గా వీడియోలు మరియు ఫోటోలు రికార్డ్ చేయబడి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అని మేము గమనించాం. అలా సెట్ లో ఎటువంటి వీడియోలు తీయకుండా ఉండాలని, అలానే వచ్చిన వీడియోల్ని వైరల్ చేయకుండా ఉండాలి అని మేము కోరుతున్నాము. ఇలా చేయటం వలన సినిమాకు నష్టం కలుగుతుంది. అంతే కాకుండా చిత్ర యూనిట్ కష్టం కూడా వృధాగా పోతుంది. దయచేసి గమనించండి, అటువంటి లీక్ అయిన వీడియోలు షేర్ చేయటం, అప్‌లోడ్ చేయడం లేదా ప్రసారం చేయడం చేస్తే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ పైన కాపీరైట్ వేసి కఠిన చర్యలు తీసుకుంటాం.

ప్రాజెక్టు కోసం చాలా కష్టపడుతున్నాం

మెగా 157 మేము చాలా జాగ్రత్తగా మరియు ప్రేమతో పనిచేస్తున్నాం. ఈ సినిమా నుంచి వచ్చిన లీక్ వీడియోలు కి ఎటువంటి సపోర్ట్ ఇవ్వకుండా వాటిని ఆపే ప్రయత్నం చేయండి అంటూ చిత్ర యూనిట్ తెలిపింది. ఇదేమైనా ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవికి జోడిగా నయనతార ఈ సినిమాలో నటిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి మెగాస్టార్ కామెడీ టైమింగ్ మిస్ అవుతున్న వాళ్లకి ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ మీల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే అనిల్ రావిపూడి చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశారు.

Related News

K – Ramp : బూతులు గురించి క్లారిటీ, లేడీ రిపోర్టర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీనియర్ నరేష్

Manchu Manoj: నా వల్లే తారక్ చేతికి గాయం.. అసలు విషయం చెప్పిన మనోజ్!

Devara Movie: థియేటర్‌లోకి దేవర.. ఫ్యాన్స్ మిస్ అవ్వకండి ఒక్క రోజే

Aryan Khan: ఏకంగా జక్కన్ననే ఒప్పించాడు, షారుక్ ఖాన్ కొడుకు మామూలోడు కాదు

Mohan Babu Look: ట్రోల్స్ ఎఫెక్ట్… మరో పోస్టర్ వచ్చేసింది… మరి దీంట్లో ఏం పెట్టారో ?

Parag Tyagi : తనని మర్చిపోలేక పోతున్నాను, పడుకునేటప్పుడు ఆమె బట్టలు పక్కలోనే..

RTC X Road: మూవీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ కి వస్తున్న మల్టీప్లెక్స్‌లు, త్వరలోనే గ్రాండ్‌ లాంచ్‌

Raj Kundra: మరో వివాదంలో శిల్పాశెట్టి భర్త  రాజ్ కుంద్రా… ఈసారి ఏంటంటే?

Big Stories

×