E-Paper
Advertisement

Harish Shankar: పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే అదే ప్లస్ పాయింట్, అల్లరి నరేష్ కాదు అందరి నరేష్

Harish Shankar: పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే అదే ప్లస్ పాయింట్, అల్లరి నరేష్ కాదు అందరి నరేష్
Advertisement

Harish Shankar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న రైటర్ కం డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. మొదటి సినిమాతో షాక్ అందుకొని గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. హరీష్ శంకర్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే సినిమా గబ్బర్ సింగ్. ఇప్పుడు అతను దర్శకత్వంలో రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని అందరికీ అంచనాలు ఉన్నాయి.

అల్లరి నరేష్ నటించిన రైల్వే కాలనీ సినిమా ఈవెంట్ కు హరీష్ శంకర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈవెంట్లో పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చేశారు. డిసెంబర్ లో ఫస్ట్ సింగిల్ రాబోతుంది. డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత చెబుతా అన్నారు.

పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే అదే ప్లస్ 

Advertisement

ఈ సినిమాకి సంబంధించి స్పీచ్ మొదలుపెట్టేముందు ఒక ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చారు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే ఒక ప్లస్ పాయింట్ ఉంది. సినిమాకి మనం ప్రమోషన్ చేయక్కర్లేదు ఆటోమేటిక్ గా సినిమా ప్రమోషన్ కూడా జరిగిపోతుంది అన్నారు.

నేను డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఇవి సత్యనారాయణ గారితో ఎక్కువ టైం కేటాయించలేకపోయాను. మామూలుగా ఒకసారి మాత్రమే కలిసా. అందుకే నేను నరేష్ గారి సినిమా ఈవెంట్ అంటే ఏమీ ఆలోచించకుండా వచ్చేస్తాను.

Advertisement

నరేష్ గారు అన్ని జోనర్ సినిమాలు చేశారు. అతని కేవలం అల్లరి సినిమా చేయడం వల్ల అల్లరి నరేష్ అనే పేరు వచ్చింది. కానీ అతను వాస్తవానికి అందరి నరేష్ అని మాట్లాడారు. నరేష్ గారు చాలా థాంక్యూ నేను మా సినిమా ఈవెంట్స్ లో కొన్ని పనులు విజయ్ చూసుకునేవాడు. అటువంటి మా విజయ్ ను మీరు డైరెక్టర్ చేసేసారు. డైరెక్టర్ గా పరిచయం అవుతున్న సినిమా మంచి సక్సెస్ అవ్వాలి అని కోరుకున్నాను అది జరిగిపోయింది.

ఐ బొమ్మ రవి పై రియాక్షన్ 

ఐ బొమ్మ ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ నేను మీడియాను చూస్తున్నాను. సినిమా ఇండస్ట్రీ తరపున నేను చెబుతున్నాను. పైరసీ సినిమా చూపించే ఐ బొమ్మ వాడికి, ఒరిజినల్ బొమ్మ చూపించిన యావత్ పోలీస్ యంత్రాంగానికి , సివి ఆనంద్ గారికి, సజ్జనర్ గారికి మా తరఫున మన అందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను.

నవంబర్ 21న ఈ సినిమా రిలీజ్ అవుతుంది నేను కూడా థియేటర్లోనే చూస్తున్నాను. మీరు కూడా రండి అంటూ పిలుపునిచ్చాడు హరీష్ శంకర్.

Also Read: Nithiin : ఆ విలక్షణ దర్శకుడు తో నితిన్ సినిమా, ఇతనైన హిట్ ఇస్తాడా?

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×