Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో బాండింగ్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొన్నిసార్లు అదే బాండింగ్ ముంచితే, మరికొన్ని సార్లు అదే బాండ్ గట్టెక్కిస్తుంది. ఇక సీజన్ 9 అయితే ఆ బాండ్ కోసమే పెట్టినట్టు ఉంది. ఈసారి ఓవైపు తనూజా – కళ్యాణ్, డెమోన్ – రీతూ జంట, మరోవైపు దివ్య – భరణి బాండ్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఇక తనూజా, కళ్యాణ్ అయితే సైలెంట్ గా ఉంటూనే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ తాజాగా కెప్టెన్ తనూజ కళ్యాణ్ కు షాకిచ్చే డెసిషన్ తీసుకుంది.
సోమవారం అంటే బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల రచ్చ షరా మామూలే. కానీ 11వ వారం ఆ హీటు మరింత ఎక్కువైంది. ఇక నామినేషన్లలో రీతూ, సంజన, కళ్యాణ్, డెమోన్, ఇమ్మూ, భరణి, దివ్య ఉండగా, కెప్టెన్ పవర్ తనూజా ఇచ్చిన ట్విస్ట్ మాములుగా లేదు. కెప్టెన్ కు ఉన్న పవర్ తో వీరిలో ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ ను బిగ్ బాస్ తనూజాకు ఇచ్చారు. మాములుగా అయితే కళ్యాణ్ తో ఎక్కువ క్లోజ్ గా ఉంటుంది తనూజ. కాబట్టి అతన్నే సేవ్ చేస్తుందని అందరూ అనుకుంటారు. కానీ హౌస్ మొత్తం కక్షగట్టినట్టుగా కట్టగట్టుకుని ఈసారి రీతూపై పడ్డారు. ఆశ్చర్యకరంగా తనూజా రీతూనే సేవ్ చేసింది. దీంతో ఆమె కళ్యాణ్ కు హ్యాండ్ ఇచ్చినట్టు అయ్యింది.
అయితే హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ మీద పడ్డట్టు… తనూజా – డెమోన్ గొడవకు కళ్యాణ్ బలైనట్టు అన్పిస్తోంది ఇదంతా చూస్తుంటే. తనూజ బీబీ రాజ్యం టాస్క్ లో మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ డెమోన్ గురించి అనవసర రాద్ధాంతం చేసింది. ఆమెదే తప్పు అని వీకెండ్ ఎపిసోడ్లో స్వయంగా నాగార్జున వచ్చి చెప్పినా ఇంకా అర్థం కాలేనట్టుంది తనూజాకు. నామినేషన్స్ టైంలో ‘మ్యాన్ హ్యాండ్లింగ్ అని తనూజా అన్నప్పుడు నేను హర్ట్ అయ్యాను. నువ్వు ఆమెకే సపోర్ట్ చేశావు’ అని అన్నాడు డెమోన్. ‘తనూజాను అడుగు నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పానో లేదో. నేను చెప్పానని సారీ చెప్పడం కాదు తనంతట తానుగా చెప్పాలి’ అని కళ్యాణ్ సమాధానం ఇచ్చాడు. కానీ తనూజా మాత్రం ‘నాకంటే ముందు డెమోన్ ఎందుకు సారీ చెప్పాడో అడుగు’ అంటూ కళ్యాణ్ పై అరిచింది. మరి దీని ఎఫెక్టో, లేదంటే రీతూతో ఉన్న ఫ్రెండ్షిప్పో తెలీదు కానీ నామినేషన్స్ నుంచి కళ్యాణ్ ను పక్కన పెట్టి రీతూని సేవ్ చేసింది తనూజ.
Read Also : ఓటీటీలోకి 5598 కోట్ల హాలీవుడ్ రేసింగ్ థ్రిల్లర్… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?