E-Paper
Advertisement

Harsha Vardhan: ఇంటికి తాళం వేస్తే గానీ దొంగలను మార్చలేము.. అనసూయకు హర్షవర్ధన్ స్ట్రాంగ్ కౌంటర్!

Harsha Vardhan: ఇంటికి తాళం వేస్తే గానీ దొంగలను మార్చలేము.. అనసూయకు హర్షవర్ధన్ స్ట్రాంగ్ కౌంటర్!

Harsha Vardhan:సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న విషయం ప్రముఖ నటుడు శివాజీ.. ఒక ఈ సినిమా ఈవెంట్లో హీరోయిన్స్ ధరించే దుస్తులపై కామెంట్లు చేయడమే.. అయితే ఈ వివాదం ఎంతకు దారి తీసింది అంటే.. ఆఖరికి కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై స్పందించారు. ముఖ్యంగా ఈ విషయంలోకి సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ , ప్రముఖ నటుడు నాగబాబు లాంటి వారు కూడా రంగంలోకి దిగి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అంతేకాదు ప్రముఖ యూట్యూబర్ గా పేరు సంపాదించిన నా అన్వేష్ కూడా నోరు జారి మాట్లాడుతూ ఏకంగా హిందూ దేవుళ్ళ పైన , ఆఖరికి గరికపాటిని కూడా రంగంలోకి దింపారు. దీంతో అతని పై కేసులు కూడా నమోదవడం ఇలా ఎన్నో విషయాలు.. మరెన్నో వివాదాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించాయి.

దొంగల్ని మార్చడం కంటే ఇంటికి తాళం వేయడం ఉత్తమం..

అయితే ఇప్పుడు ఈ వివాదం సద్దుమణిగింది అనుకునేలోపే ప్రముఖ నటుడు హర్షవర్ధన్ ఇటీవల పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడమే కాకుండా అనసూయ,శివాజీలపై కూడా సంచలన కామెంట్లు చేయడం వైరల్ గా మారుతోంది. ఒక రకంగా చెప్పాలి అంటే అనసూయ శివాజీ పేర్లను బయటకు తీస్తూనే మరొకవైపు ఇండైరెక్టుగా వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు అనిపిస్తోంది..
.హర్షవర్ధన్ మాట్లాడుతూ.. దొంగల మనసు మార్చడం కంటే.. మన ఇంటికి తాళం వేసుకోవడం మంచిదనే సిద్ధాంతాన్ని నేను ఎక్కువగా నమ్ముతాను.. ఎందుకంటే నా ఇంటికి నేను తాళం వేసుకోవడం చాలా సులువు..నా ఇంట్లో నా కూతురుకో, చెల్లికో, తల్లికో ఇలా నా ఇంట్లో ఉన్న ఎవరో ఒకరికి.. అమ్మ తలుపులు సరిగ్గా వేసుకోండి.. నేను బయటకు వెళ్తున్నాను.. తలుపులు తీసి ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పడం నాకు ఈజీ అవుతుంది.. కానీ బయట ఒక బోర్డు పెట్టి దొంగల్లారా దయచేసి ఆలోచించండి.. నేను లేని టైంలో ఒంటరిగా ఉన్న మా అమ్మ జోలికి రాకండి అని చెప్పడం చాలా కష్టం.

అనసూయకు కౌంటర్ ఇచ్చిన హర్షవర్ధన్..

మనం ఆడపిల్లలకి చదువుకోవడానికి చాలా స్వేచ్ఛ ఇవ్వాలి, ఏ వృత్తి ఎంచుకుంటే ఆ వృత్తిలో స్వేచ్ఛ కావాలి, తినడానికి, ఇష్టమైన వాటికి స్వేచ్ఛ కావాలి.. కానీ ఇక్కడ బేసిగ్గా సమస్య ఏమిటంటే వేసుకుంటున్న మనం వేసుకున్న బట్టలను.. చూస్తున్న వాళ్ల గురించి నా ప్రాబ్లం. ఇకపోతే గత కొన్ని రోజులుగా జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి ఆలోచిస్తే ఈ విషయం మరింత సులభంగా అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా రెండు విషయాలను కలిపి చూడకూడదు. స్వేచ్ఛ గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి మాత్రమే మాట్లాడాలిమీ దుస్తుల గురించి మాట్లాడేటప్పుడు.. దుస్తుల గురించి మాత్రమే మాట్లాడాలి. మంచి ఉద్దేశంతో సమాజానికి ఏదైనా చెప్పేటప్పుడు మనం మాట్లాడే తీరు కూడా సరిగ్గా ఉండాలి లేదంటే శివాజీ, అనసూయ లాగా అవుతారు” అంటూ హర్షవర్ధన్ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే వారు చెప్పిన ఉద్దేశం కరెక్టే కాని వారు మాట్లాడిన తీరు పద్ధతిగా లేదు అని తెలిపారు హర్షవర్ధన్.

ఈక్వాలిటీ అర్థం అదే..

ఇక అదే ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నిస్తూ.. శివాజీ చేసిన కామెంట్ల తర్వాత.. మగవాళ్లకు ఎవరు నీతులు చెప్పరా బట్టలు వేసుకోమని అని చెప్పి అడుగుతున్నారు? దీనికి మీరు ఏమంటారు అని ప్రశ్నించగా.. అందుకు హర్షవర్ధన్ మాట్లాడుతూ.. వాళ్లు వేసుకున్న బట్టలు ఆడవాళ్లు వేసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి, వారిలా సిగరెట్టు కాల్చడానికి కూడా ఇష్టపడతారు. మగవాళ్ళతో ఈక్వాలిటీ అంటే పోటీ పడడం కాదండి. వాళ్లు చేసే పని నేను చేయాలనుకోవడం కూడా కాదు.. నేను చేసే పని.. వాళ్లు అడ్డుకోకుండా ఉండడం అనేది ఈక్వాలిటీ అంటూ వస్త్రధారణ పై తనదైన శైలిలో కామెంట్లు చేశారు హర్షవర్ధన్.

ALSO READ:Bigg Boss Thanuja: అంతా బిగ్ బాస్ మహిమ.. బుల్లితెరకు గుడ్ బై చెప్పిన తనూజ!

Related News

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

Big Stories

×