Prabhas: ఈ రోజుల్లో దర్శకుడుగా ఒక సినిమాతో ప్రూవ్ చేసుకుంటే చాలు. మొదటి సినిమా హిట్ అయింది అంటే కనీసం మూడు నాలుగు సంవత్సరాల నుంచి అడ్వాన్సులు కూడా వచ్చేస్తాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ కు అదే జరిగింది. నాని ప్రొడ్యూసర్ గా ప్రశాంత్ వర్మ దర్శకుడుగా ఆ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అందరికీ అర్థం కాలేదు. కానీ కొంతమంది మాత్రం ప్రశాంత్ ప్రయత్నాన్ని విపరీతంగా ఆ రోజుల్లో పొగిడారు.
ఆ తర్వాత కల్కి, జాంబిరెడ్డి వంటి ఎన్నో సినిమాలు చేశాడు. వాటన్నిటిని మించి తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమా మంచి పేరును తీసుకొచ్చింది. ఎవరు ఊహించని రేంజ్ లో ఆ సినిమా ఆడింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలైంది. అప్పట్లో మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోల సినిమాలు నడుమ ఈ సినిమా వచ్చింది.
సరిగ్గా థియేటర్స్ కూడా దొరకలేదు. కానీ ఈ సినిమా ఆ సినిమాలన్నిటికంటే కూడా మంచి సక్సెస్ సాధించి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. కేవలం మౌత్ టాకుతో అప్పట్లో థియేటర్స్ కూడా పెరిగాయి.
హనుమాన్ సినిమా హిట్ అయిన తర్వాత చాలా ప్రొడక్షన్ హౌసెస్ ప్రశాంత్ వర్మకు దర్శకుడుగా అడ్వాన్సులు ఇచ్చాయి. ఇక గత కొన్ని రోజులుగా ప్రశాంత్ వర్మ చాలా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అడ్వాన్సులు తీసుకుని సినిమాలు చేయట్లేదు అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఏకంగా ప్రైమ్ సో ఎంటర్టైన్మెంట్ సంస్థ వాళ్ళు ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించారు. ఫిలిం ఛాంబర్ ను ఆశ్రయిస్తూ వాళ్లకు ఏం జరిగిందో లిఖితపూర్వకంగా రాసిచ్చారు. మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా అసలు ఏం జరిగింది అని తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చాడు.
ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హోంబాలే ప్రొడక్షన్ హౌస్ లో ప్రశాంత్ వర్మ చేయవలసిన సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది. ప్రభాస్ ఈ సినిమా నుంచి బయటకు వచ్చేసారట. దీనికి కారణం ప్రశాంత్ వర్మపై వస్తున్న ఈ ఫైనాన్షియల్ ఎలిగేషన్స్ అంటూ తెలుస్తుంది.
ప్రభాస్ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చినట్లు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన రాలేదు. కేవలం ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఒకవేళ ఇదే నిజమైతే ప్రశాంత్ నెక్స్ట్ మూవీ ఏమై ఉంటుంది? ప్రభాస్ ఇంకో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా.? అని పలు రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నిటికీ కూడా మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Also Read: Lokah Chapter1 : ఓటిటీ రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉంది, ఓవరేటేడ్ అంటూ కామెంట్స్