Lokah Chapter1 : తెలుగు ప్రేక్షకులు మన సినిమాల కంటే ఎక్కువగా ఇతర భాష సినిమాలను ఎంకరేజ్ చేస్తారు అని పలు సందర్భాలలో కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. హరీష్ శంకర్ లాంటి దర్శకులు కూడా ఈ విషయాలను స్టేజ్ పైనే పలు సందర్భాల్లో చెప్పారు. తెలుగు ప్రేక్షకులకి పెద్దగా భాషతో సంబంధం ఉండదు ఒక మంచి సినిమా వస్తే చాలు దానికి బ్రహ్మరథం పడుతుంటారు.
అలా తెలుగులో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒక తెలుగు సినిమా మంచి బజ్ ఉన్న పరభాష చిత్రం రిలీజ్ అయితే చాలామంది పరభాష చిత్రానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు అని హరీష్ అప్పట్లో చెప్పాడు. అది కూడా కొంతవరకు వాస్తవమే. అలానే దుల్కర్ సల్మాన్ నిర్మించిన కొత్త లోక అనే సినిమా తెలుగులో విడుదలైంది. ఆ సినిమాను తెలుగులో నాగ వంశీ డిస్ట్రిబ్యూషన్ చేశారు.
ఈ సినిమా విడుదలైనప్పుడు చాలామంది సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన పోస్టులు పెట్టారు. సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంది అంటూ తమ ఒపీనియన్స్ తెలియజేశారు. అయితే అప్పటికే నాగవంశీ డిస్ట్రిబ్యూషన్ చేసిన వార్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు కాబట్టి ఈ సినిమాను పెద్దగా ప్రమోట్ చేయలేకపోయాడు.
అంతేకాకుండా వార్ సినిమా సక్సెస్ కాకపోతే ఇంకెప్పుడూ మైక్ పట్టుకొని నా సినిమా చూడండి అని అడగను అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకే ఈ సినిమా విషయంలో అప్పట్లో గట్టిగా మాట్లాడలేకపోయాడు. వంశీ మాట్లాడకపోయినా చాలామంది సినిమా గురించి చెప్పారు.
ఇక రీసెంట్ గా ఈ సినిమా హాట్ స్టార్ లో విడుదలైంది. అప్పట్లో సోషల్ మీడియాలో వచ్చిన ఎలివేషన్ పోస్టులు, ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న కొన్ని కామెంట్లు అసలు మ్యాచ్ అవ్వటం లేదు. సినిమా బాగుంది ఓకే కానీ మరి సినిమాను లేపాల్సినంత లేదు అనేది చాలామందికి ఉన్న అభిప్రాయం.
అయితే ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్లు కూడా అద్భుతంగా వచ్చాయి. ఒక సినిమాకి కలెక్షన్స్ రావడం ప్రశంసలు రావడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. చాలా తక్కువ సినిమాలు మాత్రమే వస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది.