HBD Rishab Shetty: కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న వారిలో రిషబ్ శెట్టి (Rishab Shetty)ఒకరు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతారా(Kantara) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈయన నటనకు గాను నేషనల్ అవార్డు(National Award) రావడం విశేషం. ఇలా దర్శకుడిగా నటుడిగా మంచి సక్సెస్ అందుకున్న రిషబ్ శెట్టి నేడు పుట్టినరోజు(Birthday) జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అభిమానులు సినీ సెలబ్రిటీలు ఈయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నేషనల్ అవార్డు విన్నర్..
ఇలా రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా కాంతారా చాప్టర్ 1 విడుదల తేదీని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పుట్టినరోజు సందర్భంగా రిషబ్ శెట్టి సినీ ప్రస్థానం గురించి ఇక్కడ తెలుసుకుందాం… సినిమా ఇండస్ట్రీపై ఆసక్తితో రిషబ్ శెట్టి ఫిలిం డైరెక్షన్ లో డిప్లమా చేసి కన్నడ దర్శకుడు ఏ.ఎం.ఆర్ రమేష్ వద్ద ‘సైనైడ్’ చిత్రానికి అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారు. అనంతరం నామ్ ఓరీలి ఒండినా అనే సినిమాలో చిన్న పాత్రలో నటించారు. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ఈయన 2016వ సంవత్సరంలో రిక్కీ అనే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ హీరో..
ఇక 2017 వ సంవత్సరంలో రక్షిత్ శెట్టి , రష్మిక హీరో హీరోయిన్లుగా కిరిక్ పార్టీ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా వరుస సినిమాలకు దర్శకుడుగా వ్యవహరిస్తున్న రిషబ్ 2022 వ సంవత్సరంలో తన స్వీయ దర్శకత్వంలో కాంతారా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదట్లో కన్నడలో మాత్రమే విడుదల చేసిన ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ అందుకోవడంతో తెలుగులో కూడా విడుదల చేశారు. తెలుగులో కూడా మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమాను హిందీ ,తమిళ భాషలలో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
మీ పక్కన నిలబడటం గర్వంగా ఉంది..
ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయనకు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇక కాంతారా సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు ఫ్రీక్వెల్ చిత్రం కాంతారా చాప్టర్ 1 చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 2 తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఈయన పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రిషబ్ భార్య ప్రగతి (Pragathi) తన భర్త పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.”నా బలానికి, ప్రశాంతతకు, నా శాశ్వత స్ఫూర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ప్రతిరోజు మీ ప్రయాణంలో మీ పక్కన నిలబడటం చాలా గర్వంగా ఉంది. వెండితెరపై మీరు మీ వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఇంట్లో కూడా అదే ప్రేమను కనబరుస్తున్నారు. మిమ్మల్ని ఒక గొప్ప తండ్రిగా భర్తగా నిజాయితీపరుడిగా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది” అంటూ ఈమె తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
Also Read: ఇంటిని బాగా మిస్ అవుతున్న రష్మిక.. అతనితో వెకేషన్ బదులు ఇంటికెళ్లొచ్చుగా?