వేగంగా, కంఫర్ట్ గా ప్రయాణం చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ ఫ్లైట్ జర్నీ. ఇతర ప్రయాణ సౌకర్యాలతో పోల్చితే కాస్త ధర ఎక్కువే అయినా, ఆహ్లాదకరంగా గమ్య స్థానానికి చేరుకోచ్చు. అయితే, విమానంలో బెస్ట్ సీటు ఏది? అంటే చాలా మందికి పెద్దగా తెలియదు. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కో ప్లేస్ లో కూర్చోవడం ఇష్టం ఉంటుంది. అందుకే, విమాన సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం ఏది బెస్ట్ సీటు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది ఇష్టపడే సీట్లు ఎగ్జిట్ రో సీట్లు
విమానంలో ఎక్కువ మంది ఇష్టపడే సీట్లు ఎగ్జిట్ వైపు వరుస లోని విండోసీట్లు. చాలా మంది ప్రయాణీకులు ఈ సీట్లను ఏరికోరి ఎంపిక చేసుకుంటారు. ముఖ్యంగా నారో బాడీ జెట్ లలో 21A, 21F అని లేబుల్ చేయబడిన సీట్లను ఎక్కువగా తీసుకుంటారని విమాన సిబ్బంది వెల్లడించారు. “ఎగ్జిట్ రో విండో సీటు నాకు చాలా ఇష్టమైనది” అని జార్జియాకు చెందిన మాజీ విమాన సహాయకురాలు మిరియం లాసన్ చెప్పింది. సుదూర ప్రయాణాల సమయంలో అదనపు లెగ్ రూమ్ ఎక్కువ కంఫర్ట్ గా ఉంటుందన్నారు. నిశ్శబ్దంగా ఉండటంతో పాటు పక్కనే వాల్ ఉండటంతో చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చని వివరించింది.
వెనుక బిజినెస్ క్లాస్.. ముందు ఎకానమీ సీట్లు
ఇక ఎమిరేట్స్ విమానాలల్లో ప్రయాణించే ప్యాసింజర్లు ఎక్కువగా ఇష్టపడే సీట్ల గురించి ఎయిర్ హోస్టెస్ డియోన్ మిచెల్ కీలక విషయాలు వెల్లడించింది. “నాకు ఎప్పుడూ 6A లేదంటే 6F నచ్చుతుంది. బిజినెస్ క్లాస్ లో వెనుక, ఎకానమీలో ముందు సీట్లు అంటే ఇష్టం అన్నారు. అయితే, అదనపు లెగ్ రూమ్ కావాలనుకుంటే ఎగ్జిట్ రో లోని రెండో సీటు అంటే చాలా ఇష్టం అన్నారు.
కొంత మందికి ఎగ్జిట్ రో నచ్చదు!
ఇంటర్నేషనల్ విమానాల్లో పని చేసిన మాజీ ఎయిర్ హోస్టెస్ నథాలీ బెన్నెట్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ప్రయాణీకులు తరచుగా ఎగ్జిట్ వరుసలో సీట్ల అమరిక వల్ల ప్రయోజనాలను విస్మరిస్తారని చెప్పుకొచ్చింది. నిజానికి ఈ సీట్లలో కూర్చుంటే ఎవరూ ఇబ్బంది పెట్టకుండా కిటికీకి ఆనుకోవచ్చన్నారు. అంతేకాదు, ముందుగానే బోర్డింగ్, ఓవర్ హెడ్ బిన్ స్థలాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందన్నారు.
వింగ్ పైభాగం మంచిదేనా?
వింగ్ పై భాగం ఎలాంటి ఇబ్బందిలేని, ప్రశాంతమైన ప్రయాణానికి ఉపయోగకరంగా ఉంటుందని విమాన సిబ్బంది వెల్లడించారు. విమాన సహాయకులు ఎగ్జిట్ వరుసలో కూర్చోవడానికి ఇష్టపడటానికి మరొక కారణం.. ఇది సాధారణంగా వింగ్ పైన ఉంటుంది, ఇది సున్నితమైన ప్రయాణాన్ని అందిస్తుందన్నారు. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు 6వ వరుస లేదంటే 21A సరైన ప్రదేశంగా చాలా మంది అభిప్రాయపడ్డారు. అది మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతుందన్నారు. సో, ఇకపై మీరు విమాన ప్రయాణం చేసే సమయంలో ఈ ఎగ్జిట్ రో సీట్లు పొందేందుకు ప్రయత్నించండి.
Read Also: 72 గంటలు నరకం చూపించిన ఎయిర్ ఇండియా.. దేశం కాని దేశంలో..