Kokila Ben: ప్రపంచంలో అపర కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్(91) అస్వస్థతకు గురైంది. ఈ రోజు ఉదయం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హెచ్ఎన్ రిలియన్స్ ఆస్పత్రిలో చేర్పించినట్టు సమాచారం.
మీడియా నివేదకల ప్రకారం.. కోకిలా బెన్ ఆరోగ్యం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైందని.. ఆ తర్వాత వెంటనే కుటుంబ సభ్యులు హెలికాప్టర్ ద్వారా రిలియన్స్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.
ALSO READ: DSSSB Recruitment: అద్భుతమైన అవకాశం.. ఇంటర్ పాసైతే చాలు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు..