Ram Gopal Varma : టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు ఈయన చేస్తున్న సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది కాదు.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో సినిమాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమధ్య వర్మ నుంచి సినిమాలు ఏమో కానీ సోషల్ మీడియా వేదికగా ఈయనకు నచ్చని వ్యక్తులపై ఒక యుద్ధాన్ని మొదలు పెడతారు. ఆయన ఈమధ్య పెడుతున్న ట్వీట్స్ ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా సుప్రీంకోర్టు వీధి కుక్కల గురించి ఇచ్చిన తీర్పు పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ తీర్పు గురించి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్విట్టో వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. దీనిపై కొందరు వర్మకు సపోర్ట్ చేస్తే, మరికొందరు కామెంట్లు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తున్నారు..
వీధి కుక్కల గురించి సుప్రీం కోర్టు తీర్పు…
దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో రేబిస్ వంటి వ్యాధులు వస్తున్నాయని సుప్రీకోర్టు వాటిని షెల్టర్లకు తరలించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై పలు విమర్శలు రావడంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవరించుకుంది.. హోమ్ కి పంపిన కుక్కలను విడుదల చేయాలని తీర్పునిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఆర్జీవీ సంచలన పోస్ట్ పెట్టారు.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది.. వర్మ పోస్ట్ దుమారం రేపుతుంది. ఆయన ఈ ట్వీట్ తో మరోసారి వార్తల్లోకి ఎక్కారు..
MY QUESTIONS on the Supreme Court’s Revised Order Regarding Stray Dogs
1.
The Supreme Court has ruled that dogs must be vaccinated and dewormed, and then released back into the same localities where they were picked up from.My Questions:
How exactly does a dog’s vaccination…
— Ram Gopal Varma (@RGVzoomin) August 22, 2025
వర్మ ట్వీట్ లో ఏముందంటే..?
తన సంబంధం లేని వాటి గురించి కూడా వర్మ స్పందిస్తారు.. ఈ క్రమంలో కుక్కల మ్యాటర్ పై ట్వీట్ చేశారు. ప్రశ్నలు సమాధానాలతో అందరికి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు…
1. కుక్క టీకా సర్టిఫికేట్ ఒక పిల్లవాడిని వీధిలో కరవకుండా, చీల్చి చంపకుండా ఎలా కాపాడుతుంది?
2.కుక్కలు కొరుకుతాయో లేదో నిర్ణయించుకునే ముందు వాటి వైద్య ఫైల్‌ను జాగ్రత్తగా చదవాలా?
3. రేబిస్ వల్ల అకస్మాత్తుగా కుక్కల ఆకలి, ప్రాథమిక వేట ప్రవృత్తిని ఆపివేస్తుందా?
4. ఇదే పరిష్కారం అయితే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు పిల్లలు చనిపోయారు?
5. కోట్ల మంది వీధి కుక్కలను రేబిస్ కోసం పరీక్షించడానికి మన దగ్గర మౌలిక సదుపాయాలు, మానవశక్తి, డబ్బు ఉందా?
6. ప్రతి కుక్క మానసిక ఆరోగ్య ప్రొఫైల్‌ను ఎవరు ట్రాక్ చేసి రికార్డ్ చేస్తారు? మనోరోగ వైద్యులు అందిస్తారా?
7. కుక్కలలో దూకుడును కొలవడానికి ఏదైనా సృష్టించనున్నారా? అలా అయితే ఏ కుక్క ఎంత దూకుడుగా ఉందో?దేని ఆధారంగా నిర్ణయించేది ఎవరు? లేదా ఒక కమిటీ ఉంటుందా?
8. స్థితి, దూకుడును పరిశోధించడానికి పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తారా?
9. ఒక కుక్క ఒక క్షణం దాడి చేసి, మరుసటి క్షణంలో తోక ఊపుతుందని అనుకుందాం.. అది దూకుడుగా ఉందా లేదా స్నేహపూర్వకంగా ఉందా?
10. లాయర్లు, కుక్క ప్రేమికులు, పశువైద్యులు, కుక్క మనోరోగ వైద్యుల కమిటీ కలిసి కూర్చుని ప్రతి కుక్క భావోద్వేగ మానసిక స్థితిని నిర్ణయిస్తుందా?
11. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం ఇవ్వడం నిషేధమని, నియమించిన ప్రాంతాలలో మాత్రమే ఆహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబుతోంది. నిర్దేశించిన ప్రాంతాలను ఎవరు? దేని ఆధారంగా నిర్ణయిస్తారు?
12. ఈ నియమించిన ప్రాంతాల గురించి వీధివీధులు ఎలా తెలుసుకుంటారు? కుక్కల కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసిన గూగుల్ మ్యాప్ తెలియజేస్తుందా..?
13.రాష్ట్ర సరిహద్దులు కూడా మానవులను ఆపలేనప్పుడు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కుక్కల వలసను ఎలా నిరోధించవచ్చు?
14.బాధితుల గురించి పిల్లలను కూడా చంపడం గురించి ఎందుకు ప్రస్తావించలేదు? తుది ఉత్తర్వు జారీ చేసే ముందు సుప్రీంకోర్టు వీటిని పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్న అని ట్వీట్ చేశారు..
వర్మ ప్రశ్నల వెనుక ఇంత అర్థం ఉందా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది..
సినిమాల విషయానికొస్తే.. వర్మ వివాదాస్పదక చిత్రాలకు రూపం పోస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఓ రెండు మూడు భారీ ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్నారు..