Ghaati Action Trailer:చివరిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క శెట్టి (Anushka Shetty) ఇప్పుడు మరొకసారి క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా లో విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్య రావు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కాబోతోంది.
ఇకపోతే విడుదల తేదీకి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెంచడానికి మేకర్స్ భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చేతులమీదుగా తాజాగా ఈ సినిమా నుండి యాక్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఈ యాక్షన్ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఘాటీ యాక్షన్ ట్రైలర్..
ట్రైలర్ విషయానికి వస్తే ఇందులో యాక్షన్ పర్ఫామెన్స్ తో అనుష్క అదరగొట్టేసింది. ముఖ్యంగా ఇది లేడీ బ్లడ్ బాత్ మూవీ అని చెప్పడంలో సందేహం లేదు. అనుష్క శెట్టిని మునుపేన్నడు చూడని విధంగా క్రిష్ జాగర్లమూడి చాలా అద్భుతంగా చూపించారు. అటు అనుష్క కూడా తన పాత్రలో పూర్తిగా లీనమైపోయి మరీ నటించింది. ఇక పూర్తి వీడియో మీకోసం.
ALSO READ:Shilpa Shetty: సొంత రెస్టారెంట్ మూసివేయడంపై స్పందించిన శిల్పా శెట్టి.. ఏమన్నారంటే?