BigTV English

Shilpa Shetty: సొంత రెస్టారెంట్ మూసివేయడంపై స్పందించిన శిల్పా శెట్టి.. ఏమన్నారంటే?

Shilpa Shetty: సొంత రెస్టారెంట్ మూసివేయడంపై స్పందించిన శిల్పా శెట్టి.. ఏమన్నారంటే?

Shilpa Shetty: బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న శిల్పా శెట్టి (Shilpa Shetty) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. ప్రముఖ వ్యాపారవేత రాజ్ కుంద్రా (Raj Kundra)ను వివాహం చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రూ.60 కోట్ల స్కామ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె.. ఇప్పుడు తాజాగా తన సొంత రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్లు సెప్టెంబర్ 3న సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. నిజానికి ఈమె స్థాపించిన ఈ బాస్టియన్ రెస్టారెంట్ ముంబైలోని ఫేమస్ రెస్టారెంట్లలో ఒకటిగా నిలిచింది. అలాంటి రెస్టారెంట్ ను ఈమె మూసివేస్తున్నామని ప్రకటించడంతో నెటిజన్స్, అభిమానులు కారణాలు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపించారు.


రెస్టారెంట్ మూసివేయడం పై శిల్పా శెట్టి క్లారిటీ..

ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ వేదికగా మరో వీడియోతో ఆడియన్స్ ముందుకు వచ్చింది శిల్పా శెట్టి. ముంబైలోని బాంద్రాలో సుమారు పదేళ్ల క్రితం తొలి రెస్టారెంట్ అయిన బాస్టియన్ ను శిల్పా శెట్టి ప్రారంభించారు. మొదటి బ్రాంచ్ తోనే క్లోజ్ చేస్తున్నట్లు చెప్పడంతోనే అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇస్తూ.. “బాస్టియన్ రెస్టారెంట్ ను మూసి వేస్తున్నామని ప్రకటించిన తర్వాత సుమారుగా 4 వేలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రెస్టారెంట్ ని పూర్తిగా మూసివేయడం లేదు. ఎందుకంటే బాంద్రాలోని బాస్టియన్ రెస్టారెంట్ మాకు పునాది లాంటిది. ఒక చెట్టుకు ఫలాలు ఎలా లభిస్తాయో ఇప్పుడు బాస్టియన్ కూడా మాకు ఒక కొత్త ఫలాన్ని అందించబోతోంది. ఇదే ప్రదేశంలో మేము “అమ్మకై” (AMMKAI )పేరుతో దక్షిణ భారతదేశ వంటకాలను రుచి చూపించబోతున్నాము. ముఖ్యంగా నా మూలాలకు సంబంధించిన మంగళూరు వంటకాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి.

అక్టోబర్లో ప్రారంభం..


అయితే మీకు ఇష్టమైన ఈ బాస్టియన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. కానీ, బాస్టియన్ బీచ్ క్లబ్ పేరుతో జుహు ప్రాంతంలో మేము దీనిని ప్రారంభించబోతున్నాము. కాబట్టి బాస్టియన్ క్లోజ్ చేసాం అనే ప్రచారంలో నిజం లేదు. నా, సోదరుడు, వ్యాపార భాగస్వామి రంజీత్ బింద్ర వీటికి సీఈఓ గా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన ఆలోచన నుంచి వచ్చినవే . బాంద్రాలో దక్షిణ భారతదేశ వంటకాలు అక్టోబర్ నెలలోనే ప్రారంభం అవుతాయి” అంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే శిల్పా శెట్టి సొంత రెస్టారెంట్ బాస్టియన్ మూసివేస్తున్నట్లు ప్రకటించి.. ఇప్పుడు మళ్లీ అందులో నిజం లేనని ఆమె క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మరొకవైపు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

అసలేం జరిగింది అనే విషయానికి వస్తే.. సెప్టెంబర్ 3న తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన బాస్టియన్ రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్లు శిల్పా శెట్టి అధికారికంగా ప్రకటించింది. ఈ గురువారం ముంబైలోని అత్యంత ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఒకటైన బాస్టియన్ బాంద్రాకు వీడ్కోలు పలుకుతూ ఒక శకానికి ముగింపు పలుకుతున్నాము. ఈ రెస్టారెంట్ తో మాకు ఎన్నో లెక్కలేనన్ని జ్ఞాపకాలు, మరుపురాని రాత్రులు ఉన్నాయి . చివరి రోజున ఫ్రెండ్స్, వ్యాపార భాగస్వాముల కోసం ఒక ప్రత్యేకమైన సాయంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో కొత్త అనుభవాలతో మీ ముందుకు వస్తాము ” అంటూ తెలిపింది..

ALSO READ:Bigg Boss 9 Promo : బిగ్ బాస్ నుంచి బిగ్ సర్ప్రైజ్… మరో మూడు రోజుల్లోనే

?utm_source=ig_web_copy_link

Related News

Alcohol Teaser :తాగుబోతులపై యుద్ధం ప్రకటించిన అల్లరి నరేష్.. వచ్చేస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త !

Hero Darshan Case : హీరో దర్శన్‌కు ఉరిశిక్ష.. బెంగళూరు కోర్టులో హైడ్రామా

Ghaati Action Trailer : అనుష్క యాక్షన్‌కి గూస్‌బంప్స్… ఇది లేడీ బ్లడ్ బాత్

Mad Movie : ‘మ్యాడ్’ మూవీలో పాత్ర మిస్ చేసుకున్న ‘లిటిల్ హార్ట్’ హీరో మౌళి… అది చేసి ఉంటే వేరే రేంజ్..

Avatar 2 : మళ్లీ థియేటర్లలోకి అవతార్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Big Stories

×