Satya Dev : కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసి జ్యోతిలక్ష్మి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్. హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా సత్యదేవ్ కి ఉన్నాయి. కానీ సరైన కాన్సెప్ట్ ఇప్పటివరకు పడలేదు. కేవలం హీరో గానే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ వంటి సినిమాలో విలన్ గా కూడా తన టాలెంట్ ప్రదర్శించాడు.
ప్రస్తుతం సత్యదేవ్ నటిస్తున్న సినిమా కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. జులై 31న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
దేవరకొండ కాదు బంగారు కొండ
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు అన్నయ్య పాత్రలో నటించాడు సత్యదేవ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సత్యదేవ్ హాజరయ్యారు. సత్యదేవ్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ గురించి అద్భుతమైన మాటలు చెప్పారు. విజయ్ దేవరకొండ కాదు విజయ్ బంగారు కొండ అంటూ మాట్లాడారు. విజయ్ ఒకప్పుడు మాట్లాడే పద్ధతిని బట్టి తనను చాలామంది ట్రోల్ చేసేవాళ్ళు. కానీ విజయ్ క్యారెక్టర్ తెలిసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. రీసెంట్గా నాగవంశీ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎందుకు విజయ్ ను ట్రోల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆఫ్లైన్లో ఆయన్ని కలిస్తే ఇతనేనా స్టేజి మీద ఇలా మాట్లాడుతాడు అని అనిపిస్తుంది అంటూ చెప్పారు. ఏదైనా ప్రస్తుతం విజయ్ మాట్లాడే పద్ధతి కూడా పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాతో విజయ్ కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది ఊహిస్తున్నారు.
విపరీతమైన అంచనాలు
గౌతమ్ దర్శకత్వంలో కింగ్డమ్ సినిమా మొదలైనప్పటి నుంచి విపరీతంగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు నిర్మాత నాగ వంశీ. పలు సందర్భాలలో ఈ సినిమా విషయంలో ఎటువంటి రివ్యూలు వచ్చినా కూడా నేను తీసుకుంటాను అని చెప్పారు. అంతేకాకుండా ఈ సినిమా విషయంలో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కథ ఇటువంటి అంశాలు అన్ని రాసుకొని టిక్ పెట్టుకొని వచ్చినా కూడా ఈ సినిమా న్యాయం చేస్తుంది అంటూ తన నమ్మకాన్ని తెలియజేశాడు. జెర్సీ సినిమా తర్వాత గౌతమ్ డైరెక్షన్ చేస్తున్న సినిమా ఇది. బాక్స్ ఆఫీస్ వద్ద జెర్సీ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నాని ఎన్ని సినిమాలు చేసినా కూడా జెర్సీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక కింగ్డమ్ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో జులై 31న తెలుస్తుంది.
Also Read: Avatar : మరో విజువల్ వండర్, కొత్త రికార్డులు ఖాయం