Avatar Fire and Ash Trailer : చరిత్రలో కొన్ని సినిమాలకు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారు. అలా ఆదరించిన సినిమాలలో అవతార్ సినిమాకి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అవతార్ సినిమా సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
అవతార్ 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాత్మక విజయాన్ని నమోదు చేసుకుందాం. ప్రస్తుతం అవతార్ త్రీ సినిమా కోసం చాలామంది ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది.
మరో విజువల్ వండర్
అవతార్ సినిమా విడుదలై చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా మీద ఉన్న అంచనాలు తక్కువేమీ కాదు. ఆ సినిమా పేరు మీద మరో సినిమా వస్తుంది అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అవతార్ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో అవతార్ 2 సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుందాం. ఇక రీసెంట్ గా విడుదలైన అవతార్ త్రీ ట్రైలర్ మరో విజువల్ వండర్ లా అనిపిస్తుంది. అవతార్ అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారు వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్ గా ఇది రీచ్ అయింది అని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ కూడా అదే స్థాయిలో వర్కౌట్ అయ్యాయి. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా మీద క్యూరియాసిటీ పెంచుతుంది.