8 Vasantalu OTT: ఇటీవల కాలంలో సినిమాలు థియేటర్లోకి వచ్చిన నెల రోజుల వ్యవధి కాకుండానే తిరిగి ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే జూన్ 20వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు(8 Vasantalu). థియేటర్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం నెలరోజులు కూడా పూర్తి కాకుండానే ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Netfilx) కైవసం చేసుకుంది. అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ఈ సినిమా ఓటీటీ విడుదల(Ott Streaming) తేదీని ప్రకటించింది. జూన్ 20వ తేదీ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా జూలై 11వ తేదీ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతోంది.
ప్రేమించింది… ఓడిపోయింది
ఇక ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ తెలియజేస్తూ..”తను ప్రేమించింది.. ఓడిపోయింది.. ఎదిగింది” అనే క్యాప్షన్ తో స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ భాషలలో కూడా అందుబాటులోకి రాబోతుంది. ఒక ప్రేమ జంట జీవితంలోని ఎనిమిది సంవత్సరాల ప్రయాణం ఆధారంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందు ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ విడుదల తర్వాత ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయిందని చెప్పాలి.
మార్షల్ ఆర్ట్స్..
ఇలా థియేటర్లలో ప్రేక్షకులను కాస్త నిరాశపరిచిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అనంతిక సునీల్ కుమార్ (Ananthika Sunil Kumar) , హను రెడ్డి(Hanu Reddy)ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శుద్ధి అయోధ్య (అనంతిక సునీల్ కుమార్) రచయితగా కనిపిస్తారు. అయితే టీనేజ్ లోనే ఆమె రాసిన ఒక పుస్తకానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. అలాగే మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకుంటూ ఉండే అయోధ్య జీవితంలోకి అనుకోకుండా వరుణ్ (హను రెడ్డి) వస్తాడు. వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారుతుంది అయితే తన ప్రేమ విషయాన్ని అయోధ్యకు చెప్పడంతో కొంత సమయం కావాలని అయోధ్య సమాధానం ఇస్తుంది.
8 vasantalu. Thanu preminchindhi, odipoyindhi… edhigindhi. ❤️
Watch 8 Vasantalu on Netflix, out 11 July in Telugu, Tamil, Kannada and Malayalam#8VasantaluOnNetflix pic.twitter.com/7mPsS6ZITx— Netflix India South (@Netflix_INSouth) July 7, 2025
ఇలా కొంతకాలం తర్వాత అయోధ్య వరుణ్ పై తనకున్నటువంటి అభిప్రాయాన్ని, ప్రేమను తెలియజేయాలని తన వద్దకు వస్తుంది. మరి అయోధ్య తన ప్రేమ విషయాన్ని వరుణ్ కు చెప్పిందా? వరుణ్ తన ప్రేమను అంగీకరించారా? ఈ కొన్ని నెలల వ్యవధిలో ఏం జరిగింది?అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. సినిమాలో ఎన్నో అద్భుతమైన డైలాగులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని చెప్పాలి. అయితే కథ పరంగా సినిమా అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు ఏదో తెలియని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 20 రోజుల వ్యవధిలోనే ఓటీటీలో రాబోతుంది. మరి ఇక్కడ ఎలాంటి ఆదరణ పొందుతుందనేది తెలియాల్సి ఉంది.
Also Read: డార్లింగ్ కోసం ముగ్గురు కాదు.. నలుగురిని దింపిన మారుతి?