Ratsasan Sequel : సినిమా అనేది కొందరికి వినోదం అయితే, మరికొందరికి ఒక సరికొత్త రకమైన ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా ప్రతి జోనర్ ని ఇష్టపడే వేర్వేరు అభిమానులు ఉంటారు. వారిలో థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సినిమా చూస్తూ థ్రిల్ అవడం అనేది ఒక థ్రిల్. అలా కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండియా వైడ్ ప్రేక్షకులను అలరించిన చిత్రం రాట్సషన్. ఈ సినిమాని దర్శకుడు రామ్ కుమార్ తెరకెక్కించిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాల ప్రస్తావన వస్తే మొదటి వరుసలో ఉండే సినిమా రాట్సషన్.
ఈ సినిమాలో విష్ణు విశాల్, అమలాపాల్ కలిసి నటించారు. ఈ సినిమా ఒక్కో సీను జరుగుతున్న కొద్ది ఆడియన్స్ లో ఉత్కంఠ రేగుతూ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ మొదలవుతుంది. కొన్ని సందర్భాలలో వెన్నులో వణుకు పుడుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఆడియన్స్ ని థ్రిల్ చేసే మూమెంట్స్ ఈ సినిమాలో బోలెడు ఉంటాయి. అందుకే ఇండియా వైడ్ ఈ సినిమాను విపరీతంగా ఇష్టపడ్డారు. ఏ సినిమాను తెలుగులో రాక్షసుడు పేరుతో తెరకెక్కించారు.
సీక్వెల్ సిద్ధం, రిలీజ్ అప్పుడే
రాట్సషన్ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు దర్శకుడు రామ్ కుమార్ వెల్లడి చేశారు. 2026 లో రాట్ససన్ 2 సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని తెలియగానే చాలామంది థ్రిల్లర్ లవర్స్ కు మంచి థ్రిల్ గా అనిపిస్తుంది. రాట్సషన్ ఇదివరకే మంచి స్థాయిలో ఆడడం వలన, రాట్ససన్ 2 సినిమా మీద మరింత ఉత్కంఠ రేగుతుంది. రాట్ససన్ ప్రేక్షకులు ప్రశంసలతో పాటు మంచి రివ్యూలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాని చూసిన చాలామంది సోషల్ మీడియా వేదికగా విపరీతంగా పోస్టులు పెట్టారు.
Also Read : Chiru157 Update : మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, దర్శకుడు ప్లానింగ్ అదుర్స్
ఇంతకు రాట్ససన్ సినిమాలో ఏముంది.?
ఒక సినిమా దర్శకుడు అవ్వాలనుకునే వ్యక్తి కథ. ఆ వ్యక్తి ఒక నాన్న ఒక పోలీస్ ఆఫీసర్. తన తండ్రి చనిపోవడం వలన పోలీసు ఉద్యోగిగా చేరుతాడు. పోలీస్ ఉద్యోగంలో చేరిన తర్వాత సీరియల్ కిల్లర్ ను ట్రాక్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశాడు.? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎలాంటి హత్యలు చేశాడు.? చివరకు ఆ సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడు అనేది ఈ సినిమా కథ. వినడానికి మామూలుగా అనిపించిన ఈ కథ , చూడటానికి మాత్రం వెన్నులో వణుకు పుట్టేలా ఉంటుంది.
Also Read: Mega Family: మెగా ఫ్యామిలీ కి “శంకర్” శాపమయ్యాడా.?