Harihara Veeramallu Aadi Review: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా సమయం వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఇవాళ థియేటర్లలో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. మొదటినుంచి ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే.. రిలీజ్ అయిన తర్వాత అంతకుమించి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. బుధవారం రాత్రి నుంచి ఈ మూవీ ప్రీమియర్ షోలు పడడంతో అభిమానులు సినిమా స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా ఈ మూవీ గురించి జబర్దస్త్ కమెడియన్ సినీ నటుడు హైపర్ ఆది రివ్యూ ఇచ్చాడు. సినిమాపై ఆది రియాక్షన్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
‘హరిహర వీరమల్లు’ పై ఆది రియాక్షన్..
హైపర్ ఆది పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులతో పాటు ఆది కూడా ఎంతగానో వెయిట్ చేశానన్న విషయాన్ని చాలా సందర్భాల్లో పంచుకున్నారు. తాజాగా ఈ సినిమాను చూశానని మరో వీడియోని రిలీజ్ చేశారు. అందులో ఆది మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుంది.. పవన్ కళ్యాణ్ నటన, ఎం ఎం కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి.. ఈ సినిమాను చూసి మీరు బయటకు వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా బయటకు వస్తారు ఎందుకంటే సినిమా అంత బాగుంది అని అది అన్నారు.. పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి భారత దేశంలో ఉండరు. ఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్న కూడా.. మరోవైపు ఏఏం రత్నం చాలా మంచి వ్యక్తి.. ఆయన పవన్ కళ్యాణ్ గారి పరిస్థితులను అర్థం చేసుకున్నారు. ఆయనకు నష్టం కలుగుతున్న సరే.. ఆయన ఎంతో ఓపిగ్గా డేట్స్ ఇచ్చినప్పుడే సినిమాను పూర్తి చేశారు మొత్తానికి అభిమానుల కోరికనైతే తీర్చేశారు.. సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరూ సినిమాని చూడండి.. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు సినిమాని చూడమని చెప్పరు. ఈ సినిమా వల్ల నిర్మాతకు చాలా నష్టం వచ్చిందని ఉద్దేశంతోనే ఆయన సినిమా చూడమని చెప్పారు మీరందరూ సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఆది వీడియోలో చెప్పారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read:తేజేస్వి పరువు తీసేసిన స్రవంతి.. వారంలో మూడు రోజులు అదే..
హరిహర వీరమల్లు పబ్లిక్ రివ్యూ..
పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఇవాళ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది.. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటినుంచి ఉన్న అంచనాల కన్నా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ ని సొంతం చేసుకోవడం విశేషం. సినిమా స్టోరీ నుంచి పవన్ కళ్యాణ్ నటన వరకు అన్ని అద్భుతంగా ఉన్నాయంటూ పబ్లిక్ చెబుతున్నారు. క్రిష్ అలాగే జ్యోతి కృష్ణ ఏదైతే చూపించాలి అనుకున్నారో అది చక్కగా చూపించారు. డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా నటించారంటూ రివ్యూలు వస్తున్నాయి. ఈ మూవీకి అన్ని ఏరియా నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మొదటి రోజే ఈ మూవీకి దాదాపు 200 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఒకవైపు పాజిటివ్ టాక్ రావడంతో అంతకుమించి కలెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉందంటూ అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. చూడాలి మరి ఈ సినిమాకి ఏమాత్రం కలెక్షన్స్ వసూల్ అవుతాయో..
హరిహర వీరమల్లు సూపర్ గా ఉంది: హైపర్ ఆది
క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్లు, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి
అభిమానులకు నచ్చే విధంగా సినిమా తీయాలని పవన్ కళ్యాణ్ ప్రతీ సీన్ చాలా కేర్ తీసుకుని చేశారు
ఆఫ్ స్క్రీన్ లో ధర్మం కోసం పోరాడిన పవన్ ని… pic.twitter.com/2dHPD3HssK
— BIG TV Breaking News (@bigtvtelugu) July 24, 2025