BigTV English

Pawan Kalyan : అకిరా నందన్ డెబ్యు గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఖచ్చితంగా అలా ఉండాలి

Pawan Kalyan : అకిరా నందన్ డెబ్యు గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఖచ్చితంగా అలా ఉండాలి

Pawan Kalyan : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం అనేది మామూలు విషయం కాదు. చాలామంది హీరోలు వచ్చారు కొన్ని సినిమాలు చేసి కనుమరుగ అయిపోయారు. కానీ డిజాస్టర్ సినిమాలు వచ్చినా కూడా ఇండస్ట్రీలో నిలబడిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. దాదాపు పది సంవత్సరాలు హిట్ సినిమా లేకపోయినా కూడా అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.


వారసత్వం కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. చిరంజీవి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే సరిపోయింది. అని ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొత్తం పవన్ కళ్యాణ్ టాలెంట్ మీద నిలబడి ఉంది. పవన్ కళ్యాణ్ మల్టీ టాలెంటెడ్ కావడం వలన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా నిలబడ్డారు.

అకిరా నందన్ డెబ్యు


ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్ ఎంట్రీ కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిలబడటానికి టాలెంట్ మాత్రమే అవసరం అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. పరోక్షంగా అఖీరా నందన్ గురించి కూడా మాట్లాడారు. ఎటువంటి కులమత బేదాభిప్రాయాలు లేని ఏకైక ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక్కడ టాలెంట్ మాత్రమే ఉపయోగపడుతుంది. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, చిరంజీవి గారి మేనల్లుడు కావచ్చు. ఇదంతా మ్యాటర్ ఏ కాదు. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు. నీకు సత్తా లేకపోతే నువ్విక్కడ ఉండలేవు. ఇది నా కొడుకు అయినా సరే. అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

మొత్తానికి ఒక క్లారిటీ 

ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఉద్దేశం చూస్తుంటే ఎవరికైనా కూడా టాలెంట్ అనేది లేకపోతే ఇక్కడ పని జరగదు అని అర్థమవుతుంది. ఒకరకంగా పవన్ కళ్యాణ్ నిలబడ్డానికి కూడా కారణం అతనిలో విపరీతమైన టాలెంట్ ఉండడమే. అలానే రేపు ఇండస్ట్రీకి అఖీరా నందన్ ఎంట్రీ ఇచ్చిన కూడా తన టాలెంట్ మాత్రమే తనకు ఉపయోగపడుతుంది అని చెప్పకనే చెప్పారు.

Also Read: Pawan Kalyan : నేను యాక్సిడెంటల్ యాక్టర్, నాకు గత్యంతరం లేకపోతే ఆ పని చేసుకునేవాడిని

Related News

Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Big Stories

×