Rashmika Mandanna: ఈ మధ్యకాలంలో హీరోలే కాదు హీరోయిన్లు కూడా ఎక్కువగా బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు.అందులో భాగంగానే సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు సరిపోకనో.. లేక వివిధ రంగాలలో సత్తా చాటాలని అనుకుంటున్నారో తెలియదు కానీ.. ఇలా పక్క మార్గాలు కూడా వెతుకుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఒకవైపు సినిమాలు చేస్తూనే. మరొకవైపు బిజినెస్ మొదలు పెడుతున్న ఎంతోమంది హీరోయిన్లు మనకు తారస పడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సమంత (Samantha) దారిలో రష్మిక మందన్న (Rashmika mandanna) కూడా నడవబోతోంది.
బిజినెస్ మొదలుపెట్టిన రష్మిక మందన్న..
ఈ మేరకు అందుకు సంబంధించిన విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రష్మిక తన అభిమానులకు గుడ్ న్యూస్ అంటూ ‘డియర్ డైరీ’ పేరుతో ఒక పెర్ఫ్యూమ్ బ్రాండ్ ని లాంచ్ చేసింది. ఇది ఒక బ్రాండ్ లేదా ఫర్ఫ్యూమ్ కాదని ఇది తనలోని ఒక భాగమని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఈ బిజినెస్ విషయంలో తనకు అందరూ సపోర్ట్ చేయాలని కూడా కోరింది. ఈ పెర్ఫ్యూమ్ ధర సుమారుగా రూ.1600 నుండి రూ.2600 రేంజ్ లో ఉండడం గమనార్హం. ఈ ధరలు చూసాక.. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా పెర్ఫ్యూమ్ ధరలు తీసుకురావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక సమంత దారిలోనే రష్మిక మందన్న కూడా పెర్ఫ్యూమ్ బిజినెస్ మొదలు పెట్టింది. మరి ఈ రంగంలో ఆమె ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
రష్మిక మందన్న సినిమాలు..
ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశం దక్కించుకొని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది రష్మిక. ఇదిలా ఉండగా పుష్ప , పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది. అంతేకాదు తన అద్భుతమైన నటనతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ సత్తా చాటుతోంది..
రష్మిక మందన్న వ్యక్తిగత విషయాలు..
ఇకపోతే అటు కెరియర్ పరంగా ఉన్నత స్థానానికి చేరుకున్న ఈమె ఇటు వ్యక్తిగతంగా కూడా ఎన్నో రూమర్స్ ఎదుర్కొంటుంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న ఈమె.. ఇప్పటివరకు ఈ విషయంపై ఓపెన్ అవ్వలేదు. ఇటీవల ఏఐ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఫోటోలు సృష్టించబడ్డాయి. ఇక ఇది త్వరలో నిజం కావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
also read:Film industry: ఇండస్ట్రీలో మరో విషాదం.. క్యాన్సర్ తో ప్రముఖ నటి కన్నుమూత!