IND Vs ENG : మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా(Team India) మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా, ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ టీమిండియా 358 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ 311 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ ను డ్రాగా ముగించేందుకు టీమిండియా పోరాడుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ సెకండ్ ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. 311 పరుగుల లోటుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ (India) కి ప్రారంభంలోనే క్రిస్ వోక్స్ బిగ్ షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్ లో వరుస బంతుల్లో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ పెవిలియన్ కు పంపాడు. భారత్ సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Also Read : IND Vs ENG : పంత్ ప్లేస్ లో ఖతర్నాక్ ప్లేయర్ ఎంట్రీ..రికార్డులు చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే..!
రాహుల్, గిల్ అడ్డుగోడగా..
దీంతో భారత్ నాలుగో రోజే ఆలౌట్ అవుతుందని అంతా భావించారు. కానీ ఓపెనర్ కే.ఎల్. రాహుల్ (K L Rahul), కెప్టెన్ శుబ్ మన్ గిల్ ( Captain- Shubman Gill) అడ్డుగోడగా నిలిచారు. రాహుల్ (87), శుబ్ మన్ గిల్ (78) పరుగులతో అద్భుత బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ 62 ఓవర్ల పాటు తమ వికెట్ ను కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్-రాహుల్ జోడీ పలు అరుదైన ఘనతలను తమ పేరిట లిఖించుకున్నారు. ఒక టెస్టు మ్యాచ్ లో సున్నా పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తరువాత థర్డ్ వికెట్ కి అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా గిల్-రాహుల్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు దిగ్గజాలు మొహిందర్ అమర్నాథ్, గుండప్ప విశ్వనాథ్ పేరిట ఉండేది. 1977లో ఆస్ట్రేలియా పై ఇలాంటి పరిస్తితుల్లో వీరిద్దరూ మూడో వికెట్ కి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
500 మార్క్ దాటిన గిల్-రాహుల్
తాజాగా ఈ మ్యాచ్ లో మూడో వికెట్ కి 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు రాహుల్-గిల్ జోడీ. 49 ఏళ్ల తరువాత ఈ రేర్ ఫీట్ ను బ్రేక్ చేసింది. ఇంగ్లాండ్ (England) తో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్ లో శుబ్ మన్ గిల్, రాహుల్ ఇద్దరూ 500 పరుగుల మార్క్ ను దాటేశారు. ఈ సిరీస్ లో గిల్ ఇప్పటివరకు 697 పరుగులు చేయగా.. రాహుల్ 508 పరుగులు చేశాడు. విదేశీ గడ్డ పై ఓ టెస్ట్ సిరీస్ ఇద్దరూ భారత బ్యాటర్లు 500 పైగా పరుగులు చేయడం గత 54 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. వీరికంటే ముందు 1970-71 విండీస్ పర్యటనలో భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, దిలీప్ సర్దేశాయ్ ఈ ఫీట్ సాధించారు. ఆ సిరీస్ లో సునీల్ గవాస్కర్ 774, దిలీప్ సర్దేశాయ్ 642 పరుగులు చేశారు. గిల్ ఇలాగే కంటిన్యూ చేస్తే.. మరో మ్యాచ్ లో సెంచరీ చేస్తే.. సునీల్ గవాస్కర్ రికార్డు ను కూడా బ్రేక్ చేసే అవకాశం లేకపోలేదు.
Both KL Rahul and Shubman Gill have taken unlimited blows on their body but didn't give wicket for 63 overs, Manchester test will be remembered for warrior mentality shown by Indians, Nobody should forget how Rishabh Pant came to bat with fractured leg, what a series till now ♥️ pic.twitter.com/iWW3bNQPL2
— 𝐀 (@Aagneyax) July 26, 2025