Ram Gopal Varma:శ్రీదేవి(Sridevi) మరణం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఆమె మరణించినప్పటి నుండి ఆమె మరణ వార్తలపై ఎన్నో రూమర్లు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా శ్రీదేవి గురించి ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు.. ఆమెతో కలిసి వర్క్ చేసిన దర్శకుడు పంకజ్ పరాశర్ (Pankaj Parashar).. ఆయన చెప్పిన ఈ విషయం వింటే మాత్రం శ్రీదేవి అభిమానులు ఆర్జీవీపై మండిపడతారు. మరి ఇంతకీ శ్రీదేవి విషయంలో ఆర్జీవీ చేసిన తప్పేంటి.. ? దర్శకుడు పంకజ్ ఏం మాట్లాడారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీదేవిని టార్చర్ పెట్టిన ఆర్జీవీ..
డైరెక్టర్ పంకజ్ పరాశర్ తాజాగా ఫ్రైడే టాకీస్ లో జరిగిన చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి, అక్షయ్ కుమార్(Akshay Kumar) కాంబోలో వచ్చిన ‘మేరీ బీవీ కా జవాబ్ నహీన్’ అనే సినిమా ఎందుకు ఆలస్యం అయింది అనే ప్రశ్న గురించి సమాధానం ఇస్తూ.. ఈ సినిమా ఆలస్యానికి కారణం రాంగోపాల్ వర్మనే.నేను ఆయననే నిందిస్తాను. ఎందుకంటే రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) శ్రీదేవితో క్షణం క్షణం మూవీ(Kshana Kshanam Movie) చేసిన సమయంలో ఆమెను బరువు తగ్గు అంటూ బలవంత పెట్టాడు.ఇక అందం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టే శ్రీదేవి ఆర్జీవీ బలవంతం పెట్టడంతో తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత తప్పని పరిస్థితిల్లో సినిమా కోసం బరువు తగ్గింది.
నిజం బయటపెట్టిన డైరెక్టర్ పంకజ్..
బరువు తగ్గే క్రమంలో ఉప్పు తక్కువగా తినడం స్టార్ట్ చేసింది. దాంతో ఆమె బిపి పడిపోయింది. ఉప్పు తక్కువ తినడం కారణంగా షూటింగ్ సమయంలో స్పృహ తప్పి పడిపోయి, దాదాపు 20 నిమిషాలు అలాగే పడిపోయింది. అంతేకాదు అలా స్పృహతప్పి పడిపోయిన సమయంలో ఆమె తల టేబుల్ కి తగిలి ఒక పన్ను కూడా కోల్పోవాల్సి వచ్చింది. అలా ఆమె మొహానికి గాయాలు కావడంతో కొద్దిరోజులు సినిమా షూటింగ్లో పాల్గొనలేదు. అలా ఆర్జీవి చేసిన పనికి శ్రీదేవి సఫర్ అయ్యి మొహం మీద గాయాలు ఉండడంతో తన సినిమా షెడ్యూల్ కి విరామం ఇచ్చింది. దాంతో మా సినిమా వాయిదా పడాల్సి వచ్చింది. అలా మేరీ బీవీ కా జవాబ్ నహీన్ (Meri Biwi Ka Jawab Nahin ) సినిమా ఫైనాన్షియర్ కూడా మధ్యలోనే వెళ్లిపోయాడు.
అందుకే మా సినిమా ఆలస్యం అయ్యింది అంటూ క్లారిటీ..
అదే సమయంలో నిర్మాత కూడా చనిపోవడంతో సినిమాకి వరుస ఆటంకాలు ఎదురయ్యాయి. అలా సినిమా 1994లో షూటింగ్ పూర్తి అయితే 2004లో విడుదల అయింది. దీనంతటికి కారణం ఆర్జీవినే అని నేను నిందిస్తాను.. ఆర్జీవి శ్రీదేవిని బరువు తగ్గుమని ఫోర్స్ చేయడం వల్లే ఆమె క్రాష్ డైట్ మెయింటైన్ చేసి చివరికి గాయాల పాలయ్యింది. ఆ తర్వాత మా సినిమాకి కూడా ఆటంకం కలిగింది అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు డైరెక్టర్ పంకజ్ పరాశర్.
ALSO READ: Daksha Nagarkar : హైదరాబాదులో సందడి చేసిన దక్ష నాగర్కర్.. ఫోటోలు వైరల్!