Poco M7 Plus: ఎన్ని స్మార్ట్ ఫోన్లు కొత్తగా వచ్చేవాటి కోసం వినియోగదారులు ఎగబడతారు. ఎందుకంటే టెక్ యుగంలో కొత్త కొత్త ఫీచర్లు రావడంతో వాటిని సొంతం చేసుకునేందుకు దృష్టి సారిస్తారు. తాజాగా భారత మార్కెట్లో కొత్తగా స్మార్ట్ ఫోన్ విడుదల చేయనుంది పోకో సంస్థ. దీనికి సంబంధించి టీజర్‌ని షేర్ చేసింది. ఆ ఫోన్ పేరు ఇంకా పెట్టనప్పటికీ పోకో M7 ప్లస్ కావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
పోకో M7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 13న విడుదల కానుందని చెబుతున్నాయి. ధర 15 వేల లోపు ఉండే అవకాశం ఉంది. గతేడాది ఆగస్టులో మార్కెట్లోకి వచ్చిన Poco M6 Plus కంటే ఎక్కువ ఫీచర్స్‌తో భారత మార్కెట్లోకి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. పోకో సంస్థ నుంచి రానున్న ఈ ఫోన్ లో బ్యాటరీ కెపాసిటీ 7,000mAh బ్యాటరీని ఉంటుందని భావిస్తున్నారు. స్నాప్ డ్రాగన్ 6s జనరేషన్ 3 చిప్‌సెట్‌ను పరికరం ఉండవచ్చు.
పోకో ఇండియా ఫ్లిప్‌కార్ట్ పోర్టల్ లో టీజర్‌ని చేసింది. టీజర్‌లో బ్లాక్ ఫినిష్ రియర్ డిజైన్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌కు ప్రత్యేకమైన ‘పవర్ ఫర్ ఆల్’ ట్యాగ్‌లైన్ ఇచ్చింది. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉంచవచ్చని అంటున్నారు. మార్కెట్లో ఫోన్‌ని ఎప్పుడు విడుదల చేస్తారనేది అధికారికంగా డేట్ వెల్లడించలేదు. కాకపోతే ఆగస్టు 13న విడుదల కావడం ఖాయమని అంటున్నారు.
పోకో ఎం7 ప్లస్‌లో ప్రత్యేకతలు
పోకో ఎం7 ప్లస్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఉంటుంది. 6.9-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని చెబుతున్నారు. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 6s జనరేషన్ 3 చిప్‌సెట్‌తో రానుందట. కెమెరా గురించి చెప్పాలంటే 50-మెగా పిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండనుంది.
పోకో M6 ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 6.79-అంగుళాల పూర్తి HD ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంది. 108 MP ప్రైమరీ సెన్సార్, 2MP మాక్రో లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 13MP కెమెరాను అందించింది. 33W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,030mAh బ్యాటరీని కలిగి ఉంది. నీటి నిరోధకత కోసం IP53 రేటింగ్‌ను కలిగి ఉంది. రాబోయే ఫోన్ ఈ ఫీచర్లని అధిగమించేలా ఉంటుందని మార్కెట్ వర్గాల మాట.