BigTV English
Advertisement

Jr.NTR: ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ పై తళుక్కుమన్న తారక్…ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

Jr.NTR: ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ పై తళుక్కుమన్న తారక్…ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

Jr NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అతి చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR). తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన ఈయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక త్వరలోనే ఎన్టీఆర్ నటించిన వార్ 2 (War 2)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.


ఎస్క్వైర్ మ్యాగజైన్…

ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటోలు ఇండియాకు చెందిన ఎస్క్వైర్ (Esquire) మ్యాగజైన్ పై ప్రచురించడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోషూట్ దుబాయిలో జరిగినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మెరూన్ కలర్ షార్వానిలో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ లుక్ లో కూర్చుని కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన ఎస్క్వైర్ “ఫ్రమ్ టీన్ ప్రాడిజీ టు పాన్-ఇండియా పవర్‌హౌస్” గా మారిన నటుడు తారక్ అంటూ రాసుకొచ్చారు.


మొదటిసారి మ్యాగజైన్ కవర్ పేజీ పై తారక్…

ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక గొప్ప కుటుంబంలో జన్మించిన కుటుంబ వారసత్వానికి కట్టుబడి ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక గొప్ప నటుడని ఎంతో చురుకైన వ్యక్తి అంటూ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా తెలియజేశారు. ఇక ఎన్టీఆర్ సిని కెరియర్ కి సంబంధించిన అన్ని విషయాలను ఆగస్టులో తమ మ్యాగజైన్ లో ప్రచురించబోతున్నట్టు తెలిపారు. ఎస్క్వైర్ ఎన్టీఆర్ తొలి మ్యాగజైన్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ఎన్టీఆర్ ఫోటోలు మొదటిసారి ఇండియాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ కెరియర్ విషయానికి వస్తే దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోగా మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ త్వరలోనే ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసినటించిన వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం ఈ సినిమాపై మంచి అంచనాలనే పెంచేసాయి. మొదటిసారి బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న ఎన్టీఆర్ కు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: Rajeev Kanakala: ఎందుకయ్యా ఏడిపిస్తారు… చెల్లిని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్!

Related News

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

NTR: ఎన్టీఆర్ లుక్స్.. భయపడుతున్న ఫ్యాన్స్.. నీల్ మావా నువ్వే కాపాడాలి

Chikiri Song Promo : మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు

Kiran Abbavaram : కె ర్యాంప్ మూవీకి లీగల్ చిక్కులు… దాన్ని కూడా వాడేస్తున్నారా?

Dharma Mahesh: పోలీసులను ఆశ్రయించిన ధర్మా మహేష్.. భార్య గౌతమీతో పాటు అతనిపై ఫిర్యాదు!

Bahubali: The Eternal War: బాహుబలి మరణం.. ముగింపు కాదు!

Big Stories

×