యువతులపై అత్యాచారాలు, హత్యలతో తీవ్ర ఆందోళనలు చెలరేగినప్పటికీ, కోలకతా దేశంలోనే అత్యంత సేఫ్ సిటీగా గుర్తింపు తెచ్చుకుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడి అయ్యింది. కోల్‌కతా అత్యంత సురక్షితమైన నగరంగా వరుసగా నాలుగో సంవత్సరం కూడా గుర్తింపు పొందింది. 2023 ఏడాదికిగాను అత్యల్ప నేరాల రేటును నమోదు చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, ఘజియాబాద్, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, కోజికోడ్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, పూణే, సూరత్ లాంటి మొత్తం 19 మెట్రోపాలిటన్ నగరాల్లోని డేటాను పరిశీలించి NCRB టాప్ 10 లిస్టును రిలీజ్ చేసింది.
NCRB నివేదిక ప్రకారం.. కోల్ కతా 2023లో ప్రతి లక్ష జనాభాకు 83.9 నేరాలు నమోదు అయ్యాయి. 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 19 నగరాల్లో చేసిన సర్వేలో ఇదే అత్యల్పం. ఇక ఐపిసి కింద అత్యధికంగా చార్జిషీటింగ్ రేటు నమోదవుతున్న నగరాలుగా కొచ్చి (97.2 శాతం), కోల్‌కతా (94.7 శాతం), పూణే (94.0 శాతం) నిలిచాయి. 2023లో 19 నగరాల్లో శిక్షార్హమైన నేరాల సగటు రేటు లక్ష మందికి 828 అని NCRB తెలిపింది. అంతకు ముందు రెండు సంవత్సరాలతో పోల్చితే కోల్ కతాలో నేరాల రేటు తగ్గుదల కనిపించినట్లు అధికారులుత ఎలిపారు. 2021లో 103.5 ఉండగా 2022లో 86.5గా నమోదయ్యిది.
ఆయా నగరాల్లో లక్ష జనాభాకు నమోదైన కేసుల ఆధారంగా NCRB ఈ రిపోర్టును విడుదల చేసింది.
1.కోల్‌కతా – 83.9
2.హైదరాబాద్- 332.3
3.పుణే – 337.1
4.ముంబై – 355.4
5.కోయంబత్తూర్ – 409.7
6.చెన్నై – 419.8
7.కాన్పూర్ – 449.1
8.ఘజియాబాద్ – 482.6
9.బెంగళూరు – 806.2
10.అహ్మదాబాద్ – 839.3
Read Also: కుండపోత వర్షాలతో పలు రైళ్లు రద్దు.. మీ రైళ్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి!
1.కొచ్చి (కేరళ) – 3192.4
2.ఢిల్లీ – 2105.3
3.సూరత్ – 1377.1
4.జైపూర్ – 1276.8
5.పాట్నా – 1149.5
6.ఇండోర్ – 1111.0
7.లక్నో – 1015.9
8.నాగ్‌పూర్ – 962.2
9.కోజికోడ్ – 886.4
10.అహ్మదాబాద్ – 839.3
అహ్మదాబాద్ సురక్షిత, అసురక్షిత నగరాల మధ్యలో నిలిచింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్పించిన పోలీసు రికార్డులను NCRB పరిశీలించి ఈ లిస్టును తయారు చేస్తుంది. ఈ నేపథ్యంలో దాని గణాంకాలు నివేదించబడిన, నమోదు చేయబడిన నేరాలను ప్రతిబింబిస్తాయి. పోలికలు, నేరుపూరిత ధోరణులను దగ్గించేందుకు ఇటువంటి డేటా ఉపయోగకరంగా మారుతుంది.
Read Also: మిర్యాలగూడలో ఆగిపోయిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్, కారణం ఏంటంటే?