BigTV English

UP News: అక్కాచెల్లెలు ఎంత పని చేశారు.. యూపీలో షాకింగ్ ఘటన, ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా?

UP News: అక్కాచెల్లెలు ఎంత పని చేశారు.. యూపీలో షాకింగ్ ఘటన, ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా?

UP News: ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్‌ ఊహించని ఘటనలు చోటు చేసు కుంటున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు. తల్లిదండ్రులు చేసిన ఆ పనికి ఆ పిల్లలు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? పెళ్లయిన పదేళ్లకి అక్కాచెల్లెలు తమ భర్తలను మార్చుకున్న దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ స్టోరీలోకి వెళ్తే..


యూపీలో షాకింగ్ ఘటన

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ జిల్లావాసులు అక్కాచెల్లెల గురించే చర్చించుకుంటున్నారు. వీళ్లు మనుషులే కాదు రాక్షసులని కొందరు అంటున్నారు. కలికాలంలో ఏమైనా జరగొచ్చని మరికొందరు చెబుతున్నారు. ఇంతకీ అమ్మాయిల తండ్రి ఏం చేశాడు?


లలిత్‌పూర్‌ జిల్లా పాలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది. సుమారు దశాబ్దం కిందట ఓ రైతు తన ఇద్దరు కూతుళ్లకు వివాహం చేశాడు. ఇద్దరు కూతుళ్లు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇద్దరు కూతుళ్లకు ఒకరికి ఇద్దరు, మరొకరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్లంతా ఎంతో సంతోషంగా జీవించేవారు. వారిని చూసి ఇరుగు పొరుగువారు అసూయపడేవారు.

భర్తలను మార్చుకున్న అక్కాచెల్లెలు

ఆరు నెలల కిందట చిన్న కూతురు తన బావతో ప్రేమలో పడింది. ఇద్దరు క్రమం తప్పకుండా మాట్లాడుకునేవారు. ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది. ఆపై ఒక రోజు చెల్లి-బావ ఇద్దరు కలిసి లేచిపోయారు. వేరే దగ్గర కాపురం పెట్టారు. సీన్ ఇంతవరకు బాగానే జరిగింది.  చెల్లి కోసం అక్క వెతికి వెతికి అలసిపోయింది. చివరకు చెల్లిని పట్టుకుంది. తామిద్దరం వివాహం చేసుకున్నారని, కలిసి జీవించాలని డిసైడ్ అయినట్టు వెల్లడించింది.

ఆ రైతు పెద్ద కూతురు విషయానికి వద్దాం.  ఈ సమయంలో ఏం చెయ్యాలో తెలియక, మూడో వ్యక్తికి విషయం తెలియకుండా జాగ్రత్త పడింది రైతు పెద్ద కూతురు. తన చెల్లి చేసిన పని గురించి మరిదితో పంచుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. వేరేగా కాపురం పెట్టేశారు. ఇద్దరు సిస్టర్స్.. వారి వారి భర్తలను మాత్రమే కాకుండా పిల్లలు కూడా విడదీశారు.

ALSO READ: ఐసీయూలో మంటలు, ఆరుగురు పేషెంట్లు మృతి

అక్క తన ముగ్గురు పిల్లలను చెల్లికి అప్పగించింది. వారిద్దరి పిల్లలను ఇంటికి తీసుకొచ్చింది. ఈ విషయం బయటకు ఎలా తెలిసింది. నిజం ఎప్పుడైనా బయట పడుతుంది. ఈ అక్కాచెల్లెలు విషయంలో అదే జరిగింది. అక్కాచెల్లెలు ఇద్దరు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకురాకుండా జాగ్రత్త పడ్డారు.

ఇటీవల చిన్న కూతురు తన భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు వీరిని చూసి షాకయ్యారు. చిన్న కూతురు- పెద్ద అల్లుడు చేసిన ఈ పనికి ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆ తండ్రి. ఆ తర్వాత వారిని ఇంటి నుండి గెంటేశాడు. ఆ తర్వాత పెద్ద కూతురు చిన్న అల్లుడితో జీవనం సాగిస్తుందని ఆ తండ్రికి తెలిసి ఆగ్రహంతో ఊగిపోయాడు.

విషయం ఏంటంటే ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీనిపై వ్యాఖ్యానించడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. భర్తల మార్పిడి కేసు ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. అన్నట్లు ఆ మధ్య ఇండియాలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కాకపోతే అది మెట్రోపాలిటిన్ సిటీలో జరిగిన విషయం తెల్సిందే.

Related News

Fire Accident: ఐసీయూలో ఒక్కసారిగా మంటలు.. ఆరుగురు రోగుల మృతి, రాజస్థాన్‌లో ఘోరం

Nepal Landslide: కొండచరియలు విరిగిపడి.. 14 మంది మృతి

Cough Syrup: షాకింగ్.. దగ్గు మందులో విషపూరిత రసాయనాలు, టెస్టుల్లో ఏం తేలిందంటే?

Cyclone Shakti: దూసుకొస్తున్న శక్తి సైక్లోన్.. తీర ప్రాంతాలకు ఐఎండీ కీలక హెచ్చరికలు!

MLA KP Mohanan: ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. చొక్కాపట్టుకుని నడిరోడ్డుపై నిలదీసిన స్థానికులు, వైరల్ వీడియో

Rajnath Singh: సర్ క్రీక్ పై చేయి వేస్తే కరాచీని లేపేస్తాం – రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్

Warning To Pakistan: అలా చేస్తే, మ్యాప్‌లో లేకుండా పోతారు.. పాకీలకు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

Big Stories

×