Bigg Boss Buzzz Promo: బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే నాలుగు వారాల్లో ఎలిమినేషన్ను పూర్తి చేసుకున్న ఈ షో ఐదవ వరం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి మూడు వారాలు అనుకున్నట్లుగానే కంటెస్టెంట్లు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. కానీ నాలుగో వారం మాత్రం ఎవరు ఊహించని విధంగా కామనర్ మాస్క్ మాన్ హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. మొదటినుంచి నేనొక్కడినే కరెక్ట్ అంటూ హౌస్ లో కొనసాగిన ఈయన ఎలిమినేట్ అవ్వడం కొందరికి షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. హౌస్ నుంచి బయటికి వచ్చిన ఈయన శివాజీ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ బజ్ షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ని తాజాగా విడుదల చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం ఆడియన్స్ యొక్క విమర్శల ప్రశంసలు అందుకుంటుంది.. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో నుంచి చివరగా కామనర్ మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు సినీ నటుడు శివాజీ హోస్ట్ గా వ్యవహారిస్తున్న బిగ్ బాస్ బజ్ షోకు వచ్చాడు. మొదట్లో కాస్త ఫన్నీగా మొదలైన తర్వాత సీరియస్ గా మారింది. బజ్ ప్రోగామ్ ఇలా కూడా ఉంటుందా? అనేలా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. శివాజీ మాస్క్ మ్యాన్ కు మొదట సైలెంట్ గానే పలకరించి ఆ తర్వాత ఒక్కసారి ఫైర్ అయ్యాడు. అటు హరీష్ హరిత కూడా ఏ మాత్రం తగ్గకుండా మాటకు మాట సమాధానం చెబుతూ నేనింతే అన్నట్లు అంటాడు. చూస్తుంటే వీరిద్దరి మధ్య పెద్ద ఘర్షనే జరిగేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Also Read: రష్మిక – విజయ్ ఎంగేజ్మెంట్ రింగ్… వైరల్ అవుతున్న ఫోటో..
బిగ్ బాస్ బజ్ లోకి హరీష్ మాస్క్ తోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు… కానీ మీ నోటి మాటలకే ఈ రెడ్ ఫ్లవర్స్” అంటూ కౌంటర్ వేస్తూ.. స్వాగతం పలికాడు శివాజీ. హరీష్ కూడా తగ్గేదేలే అన్నట్టుగా చేతిలో ఫ్లవర్స్ పట్టుకుని మీరు రెడ్ ఫ్లవర్ అన్నారు కదా… కానీ రెడ్ అంటే నాకు వేరు పర్స్‌పెక్టివ్ ఉంటుంది అని తనదైన రీతిలో రియాక్ట్ అయ్యాడు.. శివాజీ వెంటనే కౌంటర్‌గా ఇదంతా డొల్లే అంటున్నారు ఆడియన్స్.. మొత్తానికి శివాజీ హరీష్ కు క్లాస్ పీకాడు.. ఇకపోతే ప్రోమో చివర్లో మాత్రం శివాజీ తన స్టైల్లో ఇప్పుడు అర్థమైందా మీకు… బిగ్‌బాస్ ఎంత తోపునైనా వొంగోబెట్టి పుంగి బజాయిస్తుందండి.. అంటూ దిమ్మతిరిగిపోయే డైలాగ్ వేశాడు… ప్రోమో చూస్తుంటే రసవత్తరంగా ఉంది. మరి ఎపిసోడ్ లో ఇంకెన్ని పవర్ ఫుల్ డైలాగ్లు ఉంటాయో చూడాలి..