Darjeeling landslide: పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడుతున్నాయి.ఈ ఘటనల్లో డార్జిలింగ్‌లో 28 మంది మృత్యువాతపడ్డారు. చాలామంది మిస్సింగ్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.
డార్జిలింగ్‌పై వరుణుడు పంజా
శనివారం రాత్రి నుంచి డార్జిలింగ్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మృత్యువు ఏ రూపంలో వస్తుందోనని భయంతో వణికిపోతున్నారు. 28 మంది మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు.
మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నమాట. ఇప్పటివరకు ఎంతమంది గల్లంతు అయ్యారో తెలీదు. చాలా ప్రాంతాలకు వెళ్లిన పర్యాటకులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఆయా ప్రాంతాల్లో చాలా నదులు ప్రమాదకర స్థాయులను దాటి ప్రవహిస్తున్నాయి.
కొండచరియలు విరిగిపడి 28 మంది మృతి
రోడ్లు తెగిపోవడంతో కొన్నిప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. సిలిగుడి-మిరిక్ ప్రాంతాల మధ్య బాలసోన్ నదిపై ఇనుప వంతెన కూలిపోయింది. కలింపొంగ్ జిల్లా గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తీస్తా, మాల్ పర్వత ప్రాంత నదులు ప్రమాదకరంగా మారాయి.
వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు డార్జిలింగ్ అధికారులు తెలిపారు. అలాగే నిత్యం పర్యాటకులను ఆనందాన్ని పంచే టాయ్ ట్రైన్ సేవలను నిలిపివేశారు. భారీ వర్షాలు, వాంగులు, వంకలు, నదులు పొంగి ప్రవహంచడంతో ఉత్తర బెంగాల్‌లో వరదలు వచ్చే ప్రమాదం ఉందని భూటాన్ అధికారులు హెచ్చరించారు. ఏదైనా సంఘటనకు సిద్ధంగా ఉండాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు.
ALSO READ: దేశంలో సేఫ్ సిటీ కోల్‌కతా
భూటాన్ బెంగాల్‌కు ఉత్తరాన ఉంది. దిగువన ఉన్న నీరు జల్పైగురి, కూచ్ బెహార్ జిల్లాలను ప్రభావితం చేస్తుంది. కొంతకాలంగా వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. తాలా హైడ్రోపవర్ డ్యామ్ గేట్లు తెరవలేదని, నీరు పొంగి ప్రవహిస్తోందని సమాచారం. భారత్ లోకి ప్రవేశించిన తర్వాత రైదక్ నదిగా పిలుస్తారు. బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే ముందు బెంగాల్ ద్వారా ప్రవహిస్తుంది.
Deeply anguished by the devastation caused by relentless rains & landslides across #Darjeeling & #Mirik.
Lives lost, homes destroyed, roads cut off — our people suffer.In touch with authorities & MP Office. Relief underway through GNLF volunteers.
We stand united. 💔 pic.twitter.com/isT7M0X2tv— Neeraj Tamang Zimba (@NeerajZimba) October 5, 2025
Scary scenes here in #Darjeeling
Bridge pyres gone, houses gone at Dudhiya
Communication impaired#Bengal pic.twitter.com/iObdfkdZT5
— Tamal Saha (@Tamal0401) October 6, 2025