Annapurna Studios:అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఒక ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. విధుల్లో ఉన్న తన భార్యపై జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోలో పెట్రోల్ పోసి ఆమె భర్త నిప్పంటించారు. అసలు విషయంలోకి వెళ్తే.. అన్నపూర్ణ ఫిలిం అకాడమీలో అడ్మిన్ కౌన్సిలర్ గా నివ్యా గత కొంతకాలంగా పనిచేస్తోంది. అయితే ఈమె కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల తన భర్తపై కేసు పెట్టి, తనకు దూరంగా ఉంటోందట. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయినా ఈమె భర్త రాజన్ కోపంతో.. ఈమెపై దాడి చేశారు.
భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త..
విధుల్లో ఉండగానే ఈమె ఆఫీస్ కి వచ్చి మరీ ఈమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంటనే అప్రమత్తమైన స్టూడియోలో ఉన్న సిబ్బంది నివ్యా భర్తను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వెంటనే నివ్యాను హాస్పిటల్ కి తరలించగా.. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు గుర్తించారు. అలాగే ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ తో పాటు ల్యాప్టాప్ కూడా కాలిపోయాయట. ప్రస్తుతం ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ALSO READ:Mrunal Thakur: ధనుష్ తో ఎఫైర్ రూమర్స్.. పెళ్లి, పిల్లలు అంటూ మృణాల్ షాకింగ్ స్టేట్మెంట్!