Illu Illalu Pillalu ToIlluday Episode August 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి భాగ్యం ఇంటికి వస్తుంది. కోపంగా లోపలికి వచ్చి అక్కడ ఉన్న వస్తువులని పగలగొడుతుంది. ఇప్పటికన్నా 10 లక్షలు ఇవ్వకపోతే నేను శాశ్వతంగా ఇక్కడే ఉండి పోవాల్సింది అని అంటుంది.. కానీ శ్రీవల్లి తాళాలను చూసిన ఆనందరావు నేను దొంగగా వస్తాను నువ్వు ఆ తాళాలు నాకు ఇచ్చేయ్ పది లక్షలు కొట్టేసి ఇచ్చేద్దామని అంటాడు. ఇది గనుక మా ఇంట్లో తెలిస్తే నా పరిస్థితి అంతే అని శ్రీవల్లి భయపడుతూ ఉంటుంది. ఇక రామరాజు కోసం వేదవతి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది.. రామరాజు శ్రీవల్లి కోసం ఎదురు చూస్తాడు. రామరాజుతో శ్రీవల్లి పిచ్చిదాని లాగా మాట్లాడుతూ ఉంటుంది.. రామరాజు మాత్రం మాట్లాడడానికి మాటలు ఏమున్నాయో అని అంటాడు.. మాట్లాడ్డానికి మాటలు ఏముంటాయి ఏం మాట్లాడుతున్నారండి అని బాధపడుతుంది వేదవతి. మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరుగా మారతారుగా.. నమ్మకం కరువైతే మాటలు కూడా బరువు అయితే అని రామరాజు భేదవతిని బాధపడేలా చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చందు నిద్రపోగానే మెల్లగా బయటకు వచ్చి తలుపుతీస్తుంది. తలుపు తీయగానే బయట ధీరజ్ని చూసి షాక్ అవుతుంది. అయితే ధీరజ్ ఏంటి వదిన నువ్వు ఈ టైంలో డోర్ తీయవు కదా మరి ఏం చేస్తున్నావ్? ఎవరికోసం తీసావ్? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు.. ఆశ్చర్యం కాదు ఆనందం కాదు.. మావయ్య గారు నాకు అప్పగించిన బాధ్యతని నేను నెరవేర్చాలని అనుకుంటున్నాను. ధీరజ్ శ్రీవల్లిని ఏదో టెన్షన్ పడుతున్నారు మీ ముఖం మొత్తం చమటలు పడుతున్నాయి అని అడుగుతాడు.
నేనెందుకు టెన్షన్ పడతాను నాకేం అవసరం అని శ్రీవల్లి అంటుంది. నువ్వు లోపలికి వస్తావా లేక డోర్ వేసుకుని వెళ్లిపోమంటావా అని ధీరజ్ని శ్రీవల్లి అడుగుతుంది. నువ్వు వచ్చి ప్రేమని పిలవడం నేను విన్నాను అందుకే డోర్ తీశాను. ఇక నీ ఇష్టం అని అంటుంది.. ఈరోజు వస్తాను లోపలికి అని అంటాడు. లోపలికి వెళ్ళగానే వాళ్ళ నాన్న వచ్చాడు లేదో కనుక్కుంటుంది.. డోర్ తీసి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. అయితే తిరుపతి లేచి డోర్ తెరిచింది ఏంటి నేను లేకుండా ఉంటే ఇల్లు ఏమైపోతుంది దొంగలు పడి దోచుకుపోరు అని మళ్లీ గొల్లెం పెట్టేస్తాడు..
ఇంట్లోకి వచ్చేసిన ఆనంద్ రావు శ్రీవల్లికి ఫోన్ చేసి డోర్ తీయమన్నాను కదా అమ్మడు నువ్వు మళ్ళీ డోర్ వేశావ్ ఏంటి అని అంటాడు.. శ్రీవల్లి మళ్లీ వచ్చి డోర్ తీసి మెల్లగా వెళ్ళిపోతుంది. ఆనంద్ రావు ఎలాగోలాగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఎలాగైనా సరే ఇవాళ 10 లక్షలు కొట్టేసి వెళ్లాల్సిందే అని అంటాడు. అయితే ధీరజ్ లోపలికి రాగానే ప్రేమ షాక్ అవుతుంది. మొన్నటి వరకేమో నేను వచ్చేంతవరకు వెయిట్ చేస్తూ ఉన్నావు. ఇప్పుడేమో కొత్త కొత్త పదాలు ప్రేమ దోమ అంటూ మాట్లాడుతున్నావు. నీకేమైనా న్యాయంగా ఉందా అని అడుగుతాడు.
వస్తువులకి ప్రేమలు అలాంటి ఉండవు రా.. నువ్వేం ఫీల్ అవ్వదు అని ప్రేమ అంటుంది. కానీ ఈరోజు ఇవాళ నేను ఇక్కడే పడుకుంటాను అని అడిగినా సరే ప్రేమ అస్సలు ఒప్పుకోదు. ఒకసారి కాలికి దెబ్బ తగిలిందని ఇక్కడ పడుకో అంటే నువ్వు ఏమన్నావ్ ? అది గుర్తు తెచ్చుకో అని చుక్కలు చూపిస్తుంది.. ఇప్పుడు కూడా నేను అంత త్యాగం చేస్తే నువ్వు ఏదేదో అనుకుంటావు అని ప్రేమ అంటుంది… అటు సాగర్ నర్మదతో సరసాలు ఆడతాడు.. నర్మద మాత్రం అతనికి చుక్కలు చూపిస్తుంది. ఇక నీళ్ల కోసమని వెళ్లిన నర్మదకు ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంది.
Also Read: తల్లికి మాటిచ్చిన అక్షయ్.. అవనిని మోసం చేసిన ప్రణతి..
కచ్చితంగా దొంగలాగే ఉన్నాడు అని గట్టిగా కేకలు వేస్తుంది.. అక్కడే ఉన్న తిరుపతి లేచి దొంగను పట్టుకుంటాడు. దొంగ దొంగ అని ఇద్దరు కలిసి అరవడంతో శ్రీవల్లి టెన్షన్తో మా నాన్న దొరికిపోయాడా ఏంటి అని అనుకుంటుంది.. హాయ్ బాబు ఇలా జరిగిందేంటి మా నాన్న దొరికితే ఇంకేమన్నా ఉందా అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఆనందరావు మాత్రం నర్మద చేతిలోంచి తప్పించుకొని పారిపోతాడు.. అలా తప్పించుకుని వెళ్లిన అన్న ఆనందరావు భద్రావతి ఇంట్లోకి వెళ్తాడు.. భద్రావతి గదిలోకి వెళ్లి కూర్చుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటిఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..