Mrunal Thakur:హీరోయిన్ అవ్వాలనే కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ (Mrunhal Thakur) మొదట బాలీవుడ్లో హిందీ సీరియల్స్ చేసింది. అక్కడ తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత హిందీ సినిమాలలో అవకాశం అందుకుంది. ఒకటి, రెండు సినిమాలతో పర్వాలేదనిపించుకున్న ఈమె.. తన అందంతో తెలుగు డైరెక్టర్లను కూడా ఆకర్షించింది. అలా తొలిసారి హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది మృణాల్ ఠాగూర్. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో ఆ తర్వాత నాని (Nani) నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాలో కూడా అవకాశం లభించింది. ఇందులో కూడా తన అద్భుతమైన నటన కనబరిచి తెలుగు ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యింది.
‘సన్నాఫ్ సర్దార్ 2’ ప్రమోషన్స్ లో మృణాల్ ..
ఇదే క్రేజ్ తో గత ఏడాది విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో కలిసి ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా చేసింది. కానీ ఇది పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో తెలుగులో ఈమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. కానీ బాలీవుడ్ లో ‘సన్నాఫ్ సర్దార్ 2’ సినిమాలో అవకాశం లభించింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈమెకు నిరాశే మిగిలిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈమె ఆశలన్నీ అడివి శేష్ (Adivi shesh) హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ మూవీ పైనే ఉన్నాయి అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈమెపై సడన్ గా ఎఫైర్ రూమర్స్ పుట్టుక రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే.
ధనుష్ తో ఎఫైర్ రూమర్.. పెళ్లి , పిల్లలు అంటూ మృణాల్ కామెంట్..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) తో ఈమె ఎఫైర్ నడిపిస్తోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు ధనుష్ చట్టాపట్టాలు వేసుకొని తిరగడమే కాకుండా ఇటీవల ఆయన ఇంట్లో కూడా ఈమె కనిపించడంతో రూమర్స్ మరింత బలపడ్డాయి. ఇక త్వరలోనే ధనుష్ ను వివాహం చేసుకోబోతోంది అంటూ కూడా వార్తలు వైరల్ చేశారు. ఇలా ఒకవైపు ధనుష్ తో ఎఫైర్ రూమర్స్ వస్తున్న వేళ.. సడన్ గా ఈమె ‘సన్నాఫ్ సర్దార్ 2’ ప్రమోషన్స్ లో భాగంగా ఒక షోకి హాజరైన ఈమె.. అక్కడ పెళ్లి, పిల్లలు అంటూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు – మృణాల్..
ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ..” పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం అనేది నా చిన్ననాటి కల” అంటూ మృణాల్ కామెంట్లు చేసింది. అయితే ధనుష్ తో ఎఫైర్ రూమర్స్ వేళ సడన్ గా పెళ్లి , పిల్లలు అంటూ మృణాల్ కామెంట్లు చేయడంతో ఈ వార్తలు మరింత వైరల్ గా మారుతున్నాయని చెప్పవచ్చు.
మృణాల్ కెరియర్..
మృణాల్ కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ అడివి శేష్ డెకాయిట్ మూవీ పైనే ఉన్నాయి. వాస్తవానికి అడివి శేష్ కథలు ఎంచుకున్నాడు అంటే అందులో ఏదో ఒక మంచి సబ్జెక్టు ఉంటుందని అందరికీ తెలిసిందే. అలా ఇటీవల ఆయన నటించిన సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు డెకాయిట్ కూడా మంచి విజయం అందుకుంటుందని, తన కెరియర్ గాడిన పడుతుంది అని మృణాల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి మృణాల్ ఆశలకు డెకాయిట్ మూవీ ఎలాంటి ఊపిరి పోస్తుందో చూడాలి.
ALSO READ:Anchor Ravi: ఆ స్వామీజీతో కలిసి నాపై చేతబడి చేయించారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్!