Bhogi Movie:శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే క్రేజీ మాస్ మూవీ ఈ నెల 27న రిలీజ్ కానున్న సంగతి తెల్సిందే.ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా బడ్జెట్ గురించి ,అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఇటు సోషల్ మీడియాలోనూ ,అటు ఫిలిమ్ సర్కిల్స్ లోనూ ఒక క్రేజీ డిబేట్ తెగ చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే, నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ ని దాదాపు 8 నుండి 10 కోట్ల మధ్యలో డీల్ ఒకే చేసిందన్న టాక్ వినిపిస్తుంది.ఇక శాటిలైట్ హక్కుల ద్వారా 5 కోట్లు, ఆడియో ద్వారా 70 లక్షల నుండి కోటి రూపాయల వరకు వచ్చాయని ట్రేడ్ వర్గాలు వేస్తున్న అంచనా.
అంటే మొత్తం మీద నాన్ థియేట్రికల్ రూపంలోనే సుమారు 14 నుండి 16 కోట్ల బిజినెస్ జరిగిందన్న మాట .ఇక థియేట్రికల్ గా చూస్తే , నైజాం 6 నుండి 8 కోట్లు, ఆంధ్రా 5నుండి 7 కోట్లు, సీడెడ్ 2 నుండి 3 కోట్లు, కర్ణాటక-తమిళనాడు-కేరళ కలిపి 3 కోట్లు, ఓవర్సీస్ 2 కోట్ల చొప్పున మొత్తంగా దాదాపు 20 నుండి 23 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.
అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే కనీసం 20 నుండి 25 కోట్ల షేర్, అంటే దాదాపు45 నుండి 50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుందన్న మాట .
ఇక సినిమా విషయానికి వస్తే ఈసారి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా పల్లెటూరి నేపథ్యం, పీరియాడిక్ టచ్, రస్టిక్ డ్రామాని పట్టుకున్నాడు శర్వా .ఇక వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే శర్వా ఎదో గట్టిగానే ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది.
మరో వైపు మేకర్స్ కూడా శర్వా లాస్ట్ నారీ నారీ నడుమ మురారి వంటి క్రేజీ హిట్ కొట్టడంతో పాతిక కోట్ల బడ్జెట్ ని కుమ్మరించారని వినిపిస్తుంది.అలాగే
శర్వానంద్ కెరీర్‌లోనే దాదాపు 40 నుండి 45 కోట్లతో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా భోగి నిలిచిందని ఇన్ సైడ్ టాక్ .
ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే ఇందులో శర్వానంద్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి నటిస్తున్న సంగతి తెల్సిందే. వీరితో పాటు శరత్ స్వాత్, అవినాష్, లాల్, దయానంద రెడ్డి, రోహిత్ పట్నాయక్, ఆడుకాలం నరేన్ వంటి నటులు కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు.
ఇక సంపత్ నంది గతంలో రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్,గౌతమ్ నందా సినిమాలతో పలకరించిన సంగతి తెల్సిందే.చూడాలి మరి సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మాణంలో భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నవంబర్ 27 న ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
also read:సినిమా ఒప్పుకోవాలంటే నాకు అవి రెండూ కావాలి.. మీనాక్షి అసలు లెక్క ఇదే!