E-Paper
Advertisement

జంబలకిడి పంబ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదుగా!

జంబలకిడి పంబ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదుగా!
Advertisement

Siddhi Idnani:సిద్ధి ఇద్నాని..టాలీవుడ్‌లో అందంతో పాటు అభినయం కూడా ఉన్న హీరోయిన్లలో ఈ భామ పేరు పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే, సోషల్ మీడియాలో మాత్రం వరుస అప్ డేట్స్ తో అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. ఇదిగో ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా లావెండర్ కలర్ కాస్ట్యూమ్స్ లో సిద్ధి కనిపించిన లుక్ ఫాన్స్ ని ఫిదా చేసిందనే చెప్పాలి.ఇక పనిలో పనిగా ఈ ఫొటోలకు ‘Lavender hues అంటూ క్యూట్‌గా క్యాప్షన్ పెట్టడం విశేషం.ఇక ఈ ఫొటోల్లో సిద్ధి ఇద్నాని కూల్‌గా, క్లాసీగా కనిపిస్తోందనడంలో సందేహం లేదు.

Advertisement

లావెండర్ షేడ్‌లో ఉన్న మోడ్రన్ డ్రెస్, కళ్లకు పెద్ద సన్‌గ్లాసెస్, చేతిలో ఒక చిన్న హ్యాండ్‌బ్యాగ్‌తో పూర్తిగా వెకేషన్ మూడ్‌లోకి మారినట్టు దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఇక సిద్ధి ఇద్నాని కెరీర్ విషయానికి వస్తే .. మొదట్లో చిన్న చిన్న అవకాశాలతో కెరీర్ మొదలెట్టిన ఈ భామ, ఆ తర్వాత సరికొత్త సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.నిజానికి గుజరాతీ సినిమా ‘గ్రాండ్ హాలి’తో వెండితెరకు పరిచయమైన సిద్ధి తెలుగు ప్రేక్షకులకు మాత్రం 2018లో వచ్చిన ‘జంబలకిడి పంబ’ సినిమాతో బాగా దగ్గరైంది.

Advertisement

ఆ సినిమాలో పల్లవి పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ప్రేమకథా చిత్రం 2’లో బిందు పాత్రలో కనిపించి, హారర్ థ్రిల్లర్ కథలోనూ తనదైన టాలెంట్ చూపించింది ఈ ముద్దగుమ్మ .అలాగే 2020లో వచ్చిన ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ సినిమాలో కూడా కీ రోల్ చేసింది సిద్ధి.
అయితే తెలుగులో సినిమాలు మాత్రమే కాకుండా తమిళ భాషలోనూ తళుక్కుమంది ఈ భామ.

ముఖ్యంగా తమిళ స్టార్ హీరో శింబుతో కలిసి నటించిన ‘వెందు తనిందదు కాదు’ సినిమా సిద్ధి కెరీర్‌ను మరో మలుపు తిప్పిందనే చెప్పాలి . గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పావై పాత్రలో అదరగొట్టింది సిద్ది.

ఆ తర్వాత ఆర్యతో కలిసి ‘కథర్ బాషా ఎండ్ర ముత్తురామలింగం’లోనూ కనిపించి సత్తా చాటింది..ఇక 2023లో విడుదలైన హిందీ సినిమా ‘ది కేరళ స్టోరీ’లో గీతాంజలి మీనన్ పాత్రలో నటించి నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఒకరకంగా ఈ సినిమాతోనే సిద్ధికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చిందని చెప్పాలి .ఇక అక్కడితో ఆగకుండా ‘ది గ్రేట్ గుజరాతీ మ్యాట్రిమోనీ’, ‘కప్కపీఈ’ వంటి చిత్రాలతో పాటు, 2025లో వచ్చిన తమిళ సినిమా ‘రెట్ట తల’,2026లో ‘డ్రోన్స్’, ‘నూరు కోడి వానవిల్’ లాంటి క్రేజీ ప్రాజెక్టులతో కెరీర్ లో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ .

చూడాలి మరి సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో అప్ డేట్స్ తో కూడా రచ్చ చేస్తున్న ఈ భామ రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి చేస్తుందో!

Tags

Related News

అల్లు అర్జున్ తర్వాత మళ్లీ శర్వానంద్‌కే నేషనల్ అవార్డు.. సంపత్ నంది వైరల్ కామెంట్స్ !

మా మధ్య గొడవలు లేవు.. బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్..

పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి వార్తల్లో నిజమెంత? జాతకం చూసి ఏం చెప్పారంటే!

నీ కష్టానికి ఫలితం దక్కబోతోంది… నాగచైతన్యకు కార్తీక్ వర్మ ఎమోషనల్ బర్త్ డే విషెస్

ఆరెంజ్ చీరలో అదరగొట్టిన శ్రద్ధా కపూర్.. చూపు తిప్పుకోవడం కష్టమే!

సినిమా ప్రమోషన్ల కోసం చేతబడి చేసిన హీరోలు.. షాక్ లో నిర్మాత!

చిన్నప్పుడు విన్న భయంకరమైన కథే ‘భోగి’కి స్ఫూర్తి.. అసలు విషయం బయటపెట్టిన సంపత్ నంది!

Big Stories

Advertisement
×