E-Paper
Advertisement

ప్రీ స్కూల్లో అడుగుపెట్టిన క్లిన్ కారా … ఫీజు ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే!

ప్రీ స్కూల్లో అడుగుపెట్టిన క్లిన్ కారా … ఫీజు ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే!
Advertisement

Klin Kaara School Fee: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల గారాల పట్టి క్లిన్ కారా (Klin Kaara)స్కూల్ కి వెళ్తున్నట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. క్లిన్ కారా మూడు సంవత్సరాల పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ చిన్నారిని ప్రీ స్కూల్లో చేర్చినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా మెగా ఫాన్స్ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. క్లిన్ కారా ఏ స్కూల్లో చదువుతున్నారు ఈమె ఫీజు వివరాలు ఎంత ఉంటాయి అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

లక్షల్లో క్లిన్ కారా ఫీజు..

ఇక రామ్ చరణ్ (Ramcharan)ఉపాసన (Upasana) ఇద్దరు కూడా తమ కుమార్తె క్లిన్ కారాను వెంటపెట్టుకొని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళుతున్నటువంటి వీడియోలు బయటకు వచ్చాయి అయితే ఈమె ఏ స్కూల్లో చదువుతోంది ఏంటి అనే వివరాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు బహుశా భద్రత కారణాలవల్ల ఈ విషయాలను గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. ఇక క్లిన్ కారా స్కూల్ ఫీజు (school admission fees) విషయానికి వస్తే సాధారణంగా హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్స్ లో ఏడాదికి 1.5 నుంచి 3 లక్షల వరకు ఫీజు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక క్లిన్ కారా కోసం కూడా చరణ్ దంపతులు ఈ రేంజ్ లో ఫీజు చెల్లిస్తున్నట్టు అభిమానులు భావిస్తున్నారు.

కవలలకు జన్మనిచ్చిన ఉపాసన..

Advertisement

ఇలా ప్రీ స్కూల్ కోసం లక్షల్లో ఫీజు చెల్లించడం అంటే మామూలు విషయం కాదు. సెలబ్రిటీలకు ఇలాంటివి సర్వసాధారణం అయినప్పటికీ సామాన్య ప్రజలకు మాత్రం ఇది చాలా పెద్ద విషయమనే చెప్పాలి. ఇక క్లిన్ కారా విషయానికి వస్తే ఈ చిన్నారి చరణ్ ఉపాసన దంపతుల వివాహమైన పది సంవత్సరాలకు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారి జూన్ 20, 2023లో జన్మించారు. ఇప్పటికీ పాప వయసు మూడు సంవత్సరాలు కావడంతో తనని స్కూల్ పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక క్లిన్ కారా తరువాత మరో రెండు సంవత్సరాలకు ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే .ఇలా కవలలలో ఒక అమ్మాయి అబ్బాయి కూడా జన్మించారు.

సుకుమార్ సినిమాతో బిజీగా చరణ్..

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన పెద్ది సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇదివరకే సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో RC17 సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement

Also Read: అదంతా స్క్రిప్ట్.. తప్పుగా అర్థం చేసుకోవద్దు.. రోహిత్ నాయుడు సంచలన పోస్ట్!

Related News

సినిమా ఒప్పుకోవాలంటే నాకు అవి రెండూ కావాలి.. మీనాక్షి అసలు లెక్క ఇదే!

జంబలకిడి పంబ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదుగా!

అల్లు అర్జున్ తర్వాత మళ్లీ శర్వానంద్‌కే నేషనల్ అవార్డు.. సంపత్ నంది వైరల్ కామెంట్స్ !

మా మధ్య గొడవలు లేవు.. బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్..

పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి వార్తల్లో నిజమెంత? జాతకం చూసి ఏం చెప్పారంటే!

నీ కష్టానికి ఫలితం దక్కబోతోంది… నాగచైతన్యకు కార్తీక్ వర్మ ఎమోషనల్ బర్త్ డే విషెస్

ఆరెంజ్ చీరలో అదరగొట్టిన శ్రద్ధా కపూర్.. చూపు తిప్పుకోవడం కష్టమే!

Big Stories

Advertisement
×