Meenakshi Chaudhary:మీనాక్షి చౌదరి ..లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా నాగ చైతన్యతో వృషకర్మ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ తన కెరీర్ గురించి పలు విషయాలు ఇలా చెప్పుకొచ్చింది.
ముందుగా సినిమా గురించి మాట్లాడుతూ వృషకర్మ కథలో ప్రతి పాయింట్ మరొకదానితో ముడిపడి ఉంటుందని, అందుకే ముందుగానే ఏ విషయమూ చెప్పలేనని స్పష్టం చేసింది. విష్ణు సహస్రనామంలో వృషకర్మ ఒక పేరు అని చెప్పినా, సినిమా మొత్తం చూసిన తర్వాతే ఆ టైటిల్ ఎందుకు పెట్టారో ప్రేక్షకులకు తెలుస్తుందని అసలు విషయాన్ని సస్పెన్స్ లో పెట్టింది.అయితే కథలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని ,సో ముందుగానే ఊహించకుండా థియేటర్లలో ఎంజాయ్ చేయాలని చెప్పుకొచ్చింది.
ఇక సినిమా ఒప్పుకోవడానికి తాను కొన్ని పాటిస్తానని,అందులో ఒకటి ముందుగా కథ బాగుండాలి, ఆ తర్వాత తన పాత్రకు కథను ముందుకు తీసుకెళ్లేలా ఉండాలని తన లెక్కలేమిటో వివరించింది.ఇక పాత్ర ఎంత సేపు ఉందనే దాని కంటే అది ఎంత ఇంపాక్ట్ చూపించింది అన్నదే తనకి ముఖ్యమని తెలిపింది.
ఇక కథ, క్యారెక్టర్ తర్వాత తనకు ముఖ్యమైనది టీమ్ అని, అందులోనూ దర్శకుడి మీద నమ్మకం ఉండాలని చెప్పింది. తాను ఒక డైరెక్టర్స్ యాక్టర్‌నని, సైన్ చేసిన తర్వాత దర్శకుడు చెప్పినట్టే చేస్తానని ,కానీ కథ చెప్పేటప్పుడు దర్శకుడికి క్లారిటీ ఉంటేనే ఆ సినిమా చేస్తానని కుండ బద్దలు కొట్టింది.
ఇక ప్రస్తుతం లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత తన మీద అంచనాలు పెరిగాయని, వాటికి తగ్గట్టుగా పనిచేయాలంటే సరైన దర్శకుడు ఉండాలని క్లారిటీ ఇచ్చింది.ఇక కొత్త దర్శకులతో పనిచేయడానికి కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అనుభవం కంటే ఆలోచనలో క్లారిటీనే ముఖ్యమని తేల్చి చెప్పింది.
ఇక ప్రశ్న అడిగినప్పుడు సరైన కారణంతో కన్విన్స్ చేస్తే కొత్తవాళ్లయినా సరే తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ,ఇక .ఇండస్ట్రీలో నేర్చుకున్న విషయాల గురించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు పని చేసే విధానం , థాట్ ప్రాసెస్ వేర్వేరుగా ఉంటాయని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది .
ఇక డెంటల్ డాక్టర్ స్టడీ నుంచి సినిమాల్లోకి వచ్చిన తనకు ఇక్కడ ఇండస్ట్రీలో చాలా నెగెటివ్ కామెంట్స్ ఎదురయ్యాయని ,అయితే తనకే కాకుండా ఇక్కడ సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ అందరికీ వస్తాయని చెప్పుకొచ్చింది.
అయితే తాను మాత్రం పాజిటివ్‌గా చెప్పడానికి ఏమీ లేనప్పుడు నెగటివ్‌గా మాట్లాడకూడదనే పద్ధతిలో ఉంటానని కుండబద్దలు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. చూడాలి మరి వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న ఈ అమ్మడికి వృషకర్మ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో !
also read:జంబలకిడి పంబ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదుగా!