Coolie : ఒకప్పుడు తెలుగు సినిమా తమిళ్ సినిమా అంటూ మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అదంతా కాదు. సినిమా అంతే. భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ సినిమాలు చూడటానికి ఈ మధ్యకాలంలో ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఓటిటి ఓపెన్ చేస్తే అన్ని భాషల్లో కూడా సినిమాలు అవైలబుల్ గా ఉంటున్నాయి.
ఇక తమిళ్లో నిర్మితమైన సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మిగతా ఇండస్ట్రీ స్టార్ లందరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అంటేనే అంచనాలు పెరిగిపోతాయి. అలా మంచి అంచనాలను నెలకొన్న సినిమా కూలి. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
1000 కోట్లు వస్తే క్రెడిట్ తెలుగు హీరోకి
తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో 1000 కోట్లు సినిమా చేయాలి అని ఎంతోమంది దర్శకులు కలలు కంటున్నారు. కానీ అది సాధ్యం కావడం లేదు. బాహుబలి సినిమా చూసిన తర్వాత అదే స్థాయిలో రికార్డ్స్ కొల్లగొట్టాలి అని దర్శకుడు శివ కంగువ అనే సినిమాను తీశాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊహించని డిజాస్టర్ చవి చూసింది. ఈ సినిమా నిర్మాత కూడా 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ అప్పట్లో స్టేట్మెంట్లు ఇచ్చాడు. కానీ అదేది జరగలేదు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలి సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు 1000 కోట్లు వస్తాయి అని అందరూ నమ్ముతున్నారు. ఒకవేళ ఇదే జరిగినట్లయితే ఆ క్రెడిట్ సందీప్ కిషన్ కి ఇవ్వాలి అనేది కొంతమంది అభిప్రాయం.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో సందీప్ కిషన్ ఒకరు. సినిమా కోసం సందీప్ ఏ స్థాయిలో కష్టపడతాడు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తరుణంలో సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. లోకేష్ 1000 కోట్లు కూలి సినిమాతో కొడితే ఆ క్రెడిట్ సందీప్ కి వెళ్ళాలి. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ దర్శకుడుగా పరిచయమైన మా నగరం సినిమాకి సందీప్ కిషన్ హీరో. లోకేష్ టాలెంట్ను సందీప్ ఆ రోజుల్లోనే నమ్మాడు.
భారీ అంచనాలు
ఇక ప్రస్తుతం కూలి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ తో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నాగార్జున. కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ వంటి ఎంతోమంది నటులు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ కోసం చాలామంది నిర్మాతలు పోటీపడ్డారు. మొత్తానికి ముగ్గురు నిర్మాతలు కలిసి ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
Also Read : Anirudh: ఇదెక్కడి స్కాం రా బక్కోడా, తెలుగు సాంగ్ కాపీ కొట్టి తెలుగు సినిమాకే ఇచ్చావ్