BigTV English

OTT Movies: ఈ హర్రర్ మూవీ తీసిన యూనిట్‌కు భయానక అనుభవాలు.. జీవితాలు ఛిద్రం, అసలు ఏమైంది?

OTT Movies: ఈ హర్రర్ మూవీ తీసిన యూనిట్‌కు భయానక అనుభవాలు.. జీవితాలు ఛిద్రం, అసలు ఏమైంది?

Tumbbad On Set Untold Stories and Dark Energy: ఇండియన్ బెస్ట్ హారర్ చిత్రాల్లో టుంబాడ్ టాప్ లో ఉంటుందనడంలో సందేహం లేదు. ఫోక్ హారర్ చిత్రంగా విభిన్న కథతో హిందీలో తెరకెక్కిన ఈ చిత్రం భాషతో సంబంధం లేకుండ ప్రతి ఆడియన్ ని మెప్పించింది. 2018లో థియేటర్ లో విడుదలైన ఈ సినిమాను మొదట ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఆ తర్వాత ఇతర భాషల్లో డబ్ అయి ఓటీటీలో విడుదలైన ఈ టుంబాడ్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అమెజాన్ లో ఈ సినిమా అత్యధిక వ్యూస్ తో టాప్ లో దూసుకుపోయింది. టుంబాడ్ కి వచ్చిన ఆదరణ చూసి సీక్వెల్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


రీ రిలీజ్ లో టుంబాడ్ రికార్డు

అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ, ఆడియన్స్ డిమాండ్ మేరకు టుంబాడ్ ను మరోసారి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. 2024లో రీ రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. రీ రిలీజ్ లో ఈ సినిమా రూ. 22.63 కోట్లు వసూళ్లు చేసి రికార్డు బ్రేక్ చేసింది. రీ రిలీజ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా విడుదలై ఏడేళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఇందులో ఓ కీలక పాత్ర పోషించిన నటి శ్రుతి బెనర్జీ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్లో జరిగిన భయానక సంఘటనలను బయటపెట్టింది. టుంబాడ్ రీ రిలీజ్ సందర్భంగా ఇందులో కీలక పాత్ర పోషించిన శ్రుతి బెనర్జీ తాజాగా ఓ పాడ్ కాస్ట్ కి ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా టుంబాడ్ మూవీ కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి భయానక సంఘటనలు ఎదురయ్యాయని చెప్పింది.


మూవీ సెట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ..

‘టుంబాడ్ మూవీతో పదేళ్లు జర్నీ చేశాను. ఈ సినిమా సమయంలోనే నా పెళ్లి అయ్యింది. ఈ సినిమా టైంలోనే విడాకులు కూడా అయ్యాయి. ఎందుకో తెలియదు ఈ సినిమాలో పని చేసే ప్రతి ఒక్కరిలో ఎన్నో మార్పులు వచ్చాయి. సెట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండేది. ఎందుకో తెలియదు మూవీ సెట్లో అంత మంచి వాతావరణం ఉండేది కాదు. ప్రతి ఒక్కరిలోనూ నెగిటివ్ ఎమోషన్స్ కనిపించేది. మూవీలోని నటీనటులు, టెక్నిషియన్స్, మూవీ టీంలో ఆకస్మాత్తుగా మార్పులు. మెల్లి మెల్లి మనషులు ఒక్కరిలో అసూయ, స్వార్థం, గ్రీడ్, కన్నింగ్ గా మారడం మొదలైంది. మంచి స్నేహితులు కూడా గొడవలతో విడిపోయారు. మంచి స్నేహితులుగా ఉన్న ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్స్.. మధ్య మనస్పర్థలు వచ్చాయి. మూవీ టీం, టెక్నిషియన్స్ కూడా ప్రతికూలతలు మొదలయ్యాయి. చివరికి ఈ సినిమాలో నటించిన చాలా మంది జీవితాల్లో గందరగోళం మొదలైంది. అందరు విడిపోయారు. ఎవరో కొంతమంది మాత్రం కలిసి ఉన్నారు. ఏమో తెలియదు కానీ, సెట్ లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ అవహించినట్టు అనిపించేది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఈ సినిమా కథేంటంటే

టుంబాడ్ ఓ హిందీ ఫోక్ హారర్ మూవీ. ఇది మహారాష్ట్రలోని టుంబాడ్ అనే ఊరిలో జరిగే కథ.వినాయక్ రావు (నటుడు సోహం షా) పాత్ర చూట్టూ ఈ సినిమా సాగుతుంది. అతడు తన పూర్వీకుల నుండి వచ్చిన ఒక పౌరాణిక నిధి కోసం ఆశపడతాడు. ఈ నిధి హస్తార్ అనే దేవుడి శాపంతో సంబంధం కలిగి ఉంటుంది. హస్తార్ ఇతను గతంలో సంపద, ఆహారం కోసం ఆశపడి తన దేవత తల్లి గర్భంలో శాపం పొందుతాడు. వినాయక్ తన బామ్మ హస్తార్ శాపగ్రత్తానికి గురవుతోంది. ఓ మంత్రగత్తే సలహా మేరకు ఆమె హస్తార్ రక్షణగా ఉన్న నిధిని సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఆమె హస్తార్ శాపానికి గురై దశాబ్దాలుగా ఓ చెట్టులా మారి అతి దారుణమైన జీవితాన్ని గడుపుతుంది. అయితే ఈ కథ మూడు దశలలో (1918, 1933, 1947) విభజించబడింది. ఆ నిధిని సొంతం చేసుకువాలనుకునే వినాయక్ అత్యాశ.. అతడి నాశానికి ఎలా దారితీసిందో చెప్పే కథే ఈ ‘టుంబాడ్’. ఈ చిత్రం ఆశ, నీతి, మరియు మానవ స్వభావంలోని చీకటి వైపులను అన్వేషించి..ఒక భయానక కథ. ఈ సినిమాకు రాహి అనిల్ బర్వే దర్శకత్వం వహించగా.. అదేశ్ ప్రసాద్ సహా దర్శకుడిగా వ్యవహరించారు. ఆనంద్ గాంధీ ఈ చిత్రానికి కథను అందించారు. సోహం షా ఫిల్మ్స్ బ్యానర్ పై సోహం షా, ఆనంద్ ఎల్. రాయ్, ముకేష్ షా, అమితా షాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైంలో అందుబాటులో ఉంది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Chitt ki Baat (@chittkibaat)

Related News

OTT Movie : పెళ్ళైన డాక్టర్ తో మోడల్ మెంటల్ పని… జీవితాన్నే మార్చేసే లింగరీ యాడ్… క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా

OTT Movie : తల్లి, చెల్లి ఒకేసారి డెడ్… చెరువులో దాగి ఉన్న మిస్టరీ… మైండ్ బెండయ్యే టైమ్ ట్రావెల్ మూవీ

OTT Movies: ఒక్క సినిమాలో 27 ముద్దులా? హాలీవుడ్‌‌కు సైతం షాకిచ్చిన మన ఇండియన్ మూవీ ఇదే

OTT Movie : టెర్రరిస్టు గ్రూప్ తో కుమ్మక్కు… లేడీ ఏజెంట్ రివేంజ్ ప్లాన్ కు మైండ్ బ్లాక్.. యాక్షన్-ప్యాక్డ్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయి ప్రైవేట్ వీడియో రికార్డు చేసి, చేయకూడని పని… ఈ క్రైమ్ థ్రిల్లర్లో ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

Coolie OTT: అప్పుడే ఓటీటీకి రజనీకాంత్ ‘కూలీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Big Stories

×