Anirudh: ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక కొత్త కథను కొత్త పాటను కంపోజ్ చేయొచ్చు. కానీ ఉన్నది ఉన్నట్లుగా దించటం కరెక్ట్ కాదు. అయితే సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిరుద్. కొంతమంది తెలుగు దర్శకులు కూడా పట్టుబట్టి అనిరుద్ తో మ్యూజిక్ చేయించుకోవడానికి ఇష్టపడుతుంటారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిరుద్. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించకపోవడం వలన చాలామంది అనిరుద్ ను కామెంట్ చేశారు. ఆ తర్వాత జెర్సీ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చి అందరికీ సమాధానం చెప్పాడు.
మన సాంగే మనకు ఇచ్చాడు
అనిరుద్ కొన్ని సాంగ్స్ ని కంపోజ్ చేసిన విధానం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ప్రతి దాన్లో సంగీతం ఉంటుంది అన్నట్లు, కోడి అరుపు నుంచి కూడా ఒక కొత్త పాటను క్రియేట్ చేయగలిగే స్థాయి ఉన్న సంగీత దర్శకుడు. గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కింగ్డమ్. ఈ సినిమాకి కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. అయితే నిన్న విడుదలైన “అన్నా అంటేనే” పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది. దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం రాహుల్ సిప్లిగంజ్ చేసిన పూర్ బాయ్ అనే పాట దాదాపు ఇలానే ఉంటుంది. ఆ పాటకి కోటికి పైగా వ్యూస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం దీనిని చూసి చాలామంది అనిరుద్ ఇక్కడ నుంచే ట్యూన్ లేపేసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అనుకోకుండా చేశాడా
అనిరుద్ విషయానికొస్తే మ్యూజిక్ కూడా బాగా వింటాడు. ఒక ఇంటర్వ్యూలో తాను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దానిలో కొన్ని పాటలు ఉంచానని. ఎప్పటికీ అవి వాడకూడదు అని ఫిక్స్ అయ్యానని చెప్పాడు. అలానే కొన్ని సందర్భాల్లో అవే వాడాల్సి వస్తుంది అని కూడా రివిల్ చేశాడు. దేవర సినిమా అప్పుడు కూడా అనిరుద్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ పాటను కూడా అనిరుద్ అలానే కాపీ చేసి కొత్త రకమైన ట్యూన్ క్రియేట్ చేశాడు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలానే అన్ని పాటలు అనిరుద్ మాత్రమే పాడటం వలన కూడా విసుగు పుడుతుందని కొంతమంది అంటున్నారు.
Also Read : Harihara Veeramallu: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ ఫిక్స్, కానీ ఆ గెస్ట్ డౌట్