E-Paper
Advertisement

Rajinikanth -Balakrishna:50 ఏళ్ల సినీ కెరియర్ పూర్తి..బాలకృష్ణ, రజనీకాంత్ కు అరుదైన గౌరవం!

Rajinikanth -Balakrishna:50 ఏళ్ల సినీ కెరియర్ పూర్తి..బాలకృష్ణ, రజనీకాంత్ కు అరుదైన గౌరవం!
Advertisement

Rajinikanth -Balakrishna: సినిమా ఇండస్ట్రీలో పనిచేసే నటీనటులను గౌరవిస్తూ చిత్ర పరిశ్రమ ఎన్నో రకాల అవార్డులను ప్రకటిస్తూ ఉంటారు. ఇలా సెలబ్రిటీలను గౌరవిస్తూ ప్రధానం చేసే అవార్డులలో ఇఫీ అవార్డ్స్ (IFFI Awards) కూడా ఒకటి. ఈ ఏడాది ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డులను గోవాలో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 20వ తేదీ ప్రారంభమై 28వ తేదీ ముగియనుంది ఇలా 8 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సినీ సెలబ్రిటీలను అవార్డులతో సత్కరించనున్నారు.

IFFI 2025 అవార్డులు..

ఇక ఈ అవార్డులలో భాగంగా సౌత్ ఇండియన్ స్టార్ హీరోలైన నందమూరి బాలకృష్ణ(Balakrishna), నటుడు రజనీకాంత్(Rajinikanth) కు అరుదైన గౌరవం లభించింది. ఇద్దరి హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా 50 సంవత్సరాల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నందుకు ఈ ఇద్దరి హీరోలకు ఇఫీ అవార్డు వేడుకలో ఎంతో ఘనంగా సత్కరించనున్నారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా రజనీకాంత్ బాలకృష్ణ కు ఈ గౌరవం లభించిన నేపథ్యంలో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సినీ స్వర్ణోత్సవ వేడుక..

Advertisement

బాలకృష్ణ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికే వందకు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 50 సంవత్సరాల సినీ ప్రయాణం పూర్తి కావడంతో ఇటీవల టాలీవుడ్ ఎంతో ఘనంగా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక రజనీకాంత్ సైతం ఇటీవల తన 50 సంవత్సరాల సినీ వేడుకలను జరుపుకున్నారు. ఇద్దరు హీరోలు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు ఇప్పటికీ కూడా యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

పాన్ ఇండియా స్థాయిలో ఆఖండ 2

Advertisement

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ 2 (Akhanda 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమానంతరం బాలకృష్ణ తిరిగి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో కొత్త సినిమాకు కమిట్ అవుతున్నారు. ఇక రజనీకాంత్ సినిమా విషయానికి వస్తే ఇటీవల కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ త్వరలోనే జైలర్ 2 (Jailer 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా అనంతరం కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు నుంచి దర్శకుడు సుందర్ సి తప్పుకోవడంతో కొత్త దర్శకుడి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకు రజనీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ దర్శకత్వం వహించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: IBomma Ravi: ఐబొమ్మ రవి అరెస్టుకు తన భార్యకు సంబంధం లేదు… అసలు కారణం ఇదే!

 

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×