BigTV English

Ileana D’Cruz : ఎట్టకేలకు రెండో కొడుకుని చూపించేసిన ఇలియానా.. ఏం పేరు పెట్టారంటే?

Ileana D’Cruz : ఎట్టకేలకు రెండో కొడుకుని చూపించేసిన ఇలియానా..  ఏం పేరు పెట్టారంటే?

Ileana D’Cruz : మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది ఇలియానా(Ileana D’Cruz).ప్రస్తుతం సినిమాలకు దూరంగా వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినప్పుడు సడన్గా ఒక బాబుకి జన్మనివ్వబోతున్నాను అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి కాకుండానే తల్లి అవడం ఏంటి అంటూ చాలామంది ఇలియానా పై విమర్శలు గుప్పించారు. ఇక ఏకంగా కొడుకు పుట్టాక తన భర్తను అందరికీ పరిచయం చేసింది. మైఖేల్ డోలన్ అనే విదేశీయుడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. 2023లో ఒక బాబుకు జన్మనిచ్చిన ఈమె.. ఆ బాబుకి ‘ఫీనిక్స్ డోలన్’ అని పేరు పెట్టినట్లు ఆ ఫోటోలను కూడా పంచుకుంది.


రెండోసారి తల్లి అయిన ఇలియానా.. బాబు ఫోటో రివీల్..

ఇదిలా ఉండగా.. మళ్ళీ గత కొన్ని నెలల క్రితం మరోసారి బేబీ పంపు ఫోటోలు షేర్ చేసి రెండవసారి కూడా ప్రెగ్నెంట్ అయినట్టు అభిమానులతో చెప్పుకొచ్చింది. అయితే ఈరోజు తనకు మరో బాబు పుట్టినట్టు తెలిపి.. ఆ బాబు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఇలియానా తనకు పుట్టిన రెండో కొడుకు ఫోటోను షేర్ చేసి.. తనకు మళ్లీ కొడుకు జన్మించినట్లు.. అతడి పేరు ‘కేను రాఫ్ డోలన్’ అని పేరు పెట్టినట్లు అభిమానులకు తెలియజేసింది. ప్రస్తుతం ఈ విషయాలను ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ కాస్తా అవ్వడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఇలియానాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు అబ్బాయి చాలా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.


ఇలియానా కెరియర్..

ఇలియానా కెరియర్ విషయానికి వస్తే.. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ‘దేవదాసు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇందులో రామ్ సరసన నటించి.. మొదటి చిత్రంతోనే సంచలనాత్మక విజయాన్ని అందుకున్న ఈమె.. ఈ సినిమాతో ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. తర్వాత ‘పోకిరి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇక 2006లో ‘కేడి’ అనే చిత్రంతో తమిళ సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. ఇక తర్వాత ఖతర్నాక్, రాఖీ, మున్నా వంటి తెలుగు సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకుంది. ఇకపోతే 2012లో హిందీ సినిమాలలోకి అరంగేట్రం చేసిన ఈమె అక్కడే పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మళ్లీ సౌత్ కి ఎంట్రీ ఇచ్చి జులాయ్, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలతో మరింత విజయాన్ని సొంతం చేసుకుంది ఇలియానా.
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

Related News

Manchu Manoj: మనోజ్ ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు.. చాలా రోజులైంది భయ్యా ఇలా చూసి!

Actress Girija: గుర్తుపట్టలేని స్థితిలో నాగార్జున హీరోయిన్… ఇలా తయారయ్యింది ఏంటీ?

Lokesh Kanagraj: తెలుగులో రికార్డు సృష్టించిన లోకేష్ కనగరాజ్ .. మొదటి సినిమాగా కూలీ!

Kangana Ranaut: సహజీవనంపై కంగనా హాట్ కామెంట్స్.. గర్భం వస్తే ఎవరిది బాధ్యత?

Tollywood Producer: ఒకేసారి 15 సినిమాలకు కమిట్ అయిన నిర్మాత.. రికార్డుల కోసం రిస్క్ అవసరమా?

Ram Gopal Varma: నాన్న జన్మనిస్తే.. నాగార్జున రెండో జీవితాన్ని ఇచ్చారు.. వర్మ ఎమోషనల్ !

Big Stories

×