Guppedantha Manasu : ఈమధ్య సినిమా హీరోయిన్ల కన్నా ఎక్కువగా సీరియల్ హీరోయిన్లు బాగానే సంపాదిస్తున్నారు. సీరియల్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుందన్న విషయం తెలిసిందే.. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లో నటిస్తున్న హీరోయిన్లు భారీగానే తీసుకుంటున్నారు. ఒక్క రోజుకి ఇన్ని వేలు అంటూ ముందుగానే ఫిక్స్ చేసుకొని మరీ సీరియల్కు కమిటీ అవుతున్నారు. ఈమధ్య చాలామంది సీరియల్ హీరోయిన్ల రెమ్యూనరేషన్ గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు హీరోయిన్ వసుధార రెమ్యూనరేషన్ గురించి నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. ఆమె ఒక్క రోజుకి ఎంత రెమ్యూనేషన్ తీసుకుంటుందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
‘గుప్పెడంత మనసు’ వసుధారా రెమ్యూనరేషన్..?
నిజానికి మూవీకి అయితే ఒక అమౌంట్ ఫిక్స్ అయితే అదే ఇస్తారు. కానీ సీరియల్స్ అలా కాదు.. రోజూవారీ లెక్క ఉంటుంది. అంటే ఎన్ని రోజులు షూటింగ్ చేస్తే అంత అమౌంట్ అన్నమాట. ఏళ్లకి ఏళ్లు ఎపిసోడ్‌లు నడిచినా.. ఎన్నిరోజులు షూటింగ్ చేస్తే అంతే రెమ్యూనరేషన్ వస్తుంది. ఒక్కోసారి ఒక్కరోజు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు వచ్చేలా చేస్తారు. అలా సీరియల్ హీరోయిన్లకు డైలీ వస్తుంది.. మరి స్టార్ మా లో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న డైలీ సీరియల్ హీరోయిన్ వసుధారా అలియాస్ రక్షా గౌడ తన నటనతో కుర్ర హృదయాలను కొల్లగొట్టేసింది. రిషితో వసు క్యూట్ లవ్ స్టోరీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ కావడంతో ఆమె పేరు బాగా వినిపిస్తుంది. ఈ సీరియల్ కోసం ఈ అమ్మడు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఒక్కరోజుకు సీనియర్ హీరోయిన్లతో సమానంగా రూ.17 వేలు అందుకుంటుందట. కొత్త సీరియల్ హీరోయిన్స్‌కి డేకి 17 వేలు అంటే ఎక్కువేమరి. నెలలో 20 రోజులు షూటింగ్ లో పాల్గొంటుంది.. ఆ మాటకొస్తే లక్షలు ఈమె సంపాదిస్తుంది.
Also Read : మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ హీరోయిన్ కన్నుమూత..
రక్షా గౌడ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ మొదట పలు సీరియల్స్ తో అలరించింది. ఇక ఎప్పుడైతే గుప్పెడంత మనసు సీరియల్ మొదలయ్యిందో అప్పటినుంచి ఈ చిన్నదాని రేంజ్ మారిపోయిందని చెప్పాలి. వసుగా అమ్మడు.. అల్లరి, సీరియస్ నెస్, రిషితో గొడవలు.. ఆమె క్యారెక్టర్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే గుప్పెడంత మనసు తెలుగులో వసుధారకు ఫస్ట్ సీరియల్. కన్నడంలో పుట్టమల్లి, గుజరాతీలో రాధా రాఘవ్ అనే సీరియల్స్ చేసింది. కన్నడంలో గతంలో గరుడాక్ష అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.. ఈ సీరియల్ 2020 లో ప్రారంభమైంది. అయితే మొత్తం 1168 ఎపిసోడ్స్‌తో మేకర్స్ ఈ సీరియల్‌ను ఎండ్ చేశారు. జగతి, శైలేంద్ర మారిపోవడంతో పాటు రిషి, వసుధార ఒక్కటైనట్లుగా చూపించి మేకర్స్ సీరియల్‌కు శుభంకార్డు వేశారు. గుప్పెడంత మనసు సీరియల్‌లో సాయికిరణ్, జ్యోతిరాయ్, సంగీత, సురేష్‌బాబు కీలక పాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ సీరియల్ పార్ట్ 2 రాబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లితెర పై ప్రసారం అవుతున్న షోలలో సందడి చేస్తుంది.