Samyuktha Menon:ఈమధ్య కాలంలో హీరోయిన్లు.. హీరోల సరసన జోడిగానే కాకుండా.. యాక్షన్ చిత్రాలలో కూడా నటించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సమంత(Samantha ), అలియా భట్ (Alia Bhatt), అనుష్క (Anushka) లాంటి హీరోయిన్లు ఎక్కువగా ఇలా యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక అందులో భాగంగానే లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సాధారణంగా ఒక సినిమా కథను ముందుగా ఒకరిని దృష్టిలో పెట్టుకొని కథ రాస్తారు. కానీ అనూహ్యంగా ఆ కథలోకి ఇంకొకరు వచ్చి చేరుతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట సమంత హాస్య మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు సమంతా కాదు ఆ స్థానంలో సంయుక్త అడుగు పెట్టింది.మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
హాస్య మూవీస్ బ్యానర్ పై మహిళా ప్రధాన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే అయితే మొదట ఇందులో సమంతను అనుకున్నారు కానీ కొన్ని కారణాలవల్ల ఆమెను కాదని సంయుక్త మీనన్ కి ఈ అవకాశం ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు యోగేష్ కేఎంసీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకి రాజేష్ దండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ కాగా.. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే గత ఏడాది అక్టోబర్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అప్పటినుంచి ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏడాది కావడంతో సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారో తెలియాల్సి ఉంది.
నిజానికి ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలోనే సంయుక్త మాట్లాడుతూ..” బలం లేదా శారీరక శక్తిని ఉపయోగించకుండా కేవలం ప్రతికూలతను ఎలా ఎదుర్కోవాలో చూపే మహిళ పాత్ర ఇది. ఇప్పటివరకు నేను తెలుగులో చేసిన అన్ని చిత్రాలు కూడా నాకు మంచి విజయాన్ని అందించాయి. ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్టుతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్నాను.. నా కెరియర్ లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుగా నిలుస్తుందని భావిస్తున్నాను” అంటూ సంయుక్త తెలిపింది.
ALSO READ:Actress Death: ప్రముఖ నటి కన్నుమూత.. అసలేం జరిగిందంటే?
సంయుక్త మీనన్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ , రానా కాంబినేషన్లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయింది. తర్వాత విరూపాక్ష, సార్ వంటి చిత్రాలతో కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు నిఖిల్ పాన్ ఇండియా ఫిలిం స్వయంభులో నటిస్తోంది .అంతేకాదు బాలయ్య అఖండ 2 లో కూడా ఈమె నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇలా వరుస అవకాశాలు అందుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.