Actress Death:తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అసలు ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఏమౌతోంది అనే అనుమానాలు కలగకమానదు. గత కొన్ని రోజులుగా వరుస మరణాలు అభిమానులకు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. సదరు సెలబ్రిటీల మరణాలు వారి వ్యక్తిగత కుటుంబాలను కూడా అయోమయంలోకి నెట్టి వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి సడన్గా కొంతమంది గుండెపోటుతో మరణిస్తే.. మరికొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు. ఇంకొంతమంది వృద్ధాప్య కారణాలతో తుది శ్వాస విడుస్తున్నారు.
నిన్నటికి నిన్న బాల సరస్వతి దేవి, పంకజ్ ధీర్ లాంటి వ్యక్తులు తుది శ్వాస విడవగా.. ఇప్పుడు మరొక నటి కన్నుమూసింది.. ఈమె మరణ వార్త విని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు మరణించిన ఆ నటి ఎవరు? ఆమె మరణానికి గల కారణం ఏమిటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు అమెరికన్ రంగస్థలం, సినీనటి పెనెలోప్ మిల్ఫోర్డ్ (Penelope Milford). న్యూయార్క్ లోని సౌగర్టీస్ లో ఈమె మరణించినట్లు ఈమె సోదరుడు డగ్ మిల్ఫోర్డ్ ప్రకటించారు. ప్రస్తుతం ఈమె వయసు 77 సంవత్సరాలు.. మిల్ఫోర్డ్ 1979లో కమింగ్ హోం అనే చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ నామినేషన్ కూడా పొందారు. 1970లో తన వృత్తిని ప్రారంభించిన ఈమె లెన్నీ నాటకంతో బ్రాడ్ వే లో అరంగేట్రం చేశారు. అంతేకాదు ఈమె షెనాండోహ్ కోసం డ్రామా డెస్క్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఇలాంటి ఒక గొప్ప నటి మరణించడంతో ఇటు సెలబ్రిటీలు అటు అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆమె మరణానికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అందిస్తున్నారు.
also read:Bigg Boss 9: హౌస్ కి ఇద్దరు కెప్టెన్స్… అధ్యక్షా.. అంటూ హామీ
1948 మార్చి 23న మిస్సోరీ లోని సెయింట్ లూయిస్ లో జన్మించింది. ఇల్లినాయిస్ లో తన విద్యను పూర్తి చేసింది. రిచర్డ్ జార్జ్ మిల్ఫోర్డ్, ఆన్ మేరీ మిల్ఫోర్డ్ దంపతుల కుమార్తె ఈమె. ఇల్లినాయిస్ లోని విన్నేట్కాలోని న్యూ ట్రైనర్ హై స్కూల్ నుండి పట్టభద్రురాలైన ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అయితే అతడు 37 సంవత్సరాల వయసులోనే గుండె వైఫల్యంతో మరణించారు. ఇక మరణించే సమయానికి ఆయన నటుడు, సంగీత కళాకారుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు.
ఈమె నటించిన సినిమాల విషయానికొస్తే.. 1970లో మైడ్ స్టోన్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎవెలిన్ మూర్ , వీ మున్సన్, మార్తా ఆన్ అంటూ ఇలా దాదాపు చాలా చిత్రాలలో నటించిన ఈమె.. ఇప్పుడు మరణించారు. అయితే ఈమె మరణానికి గల కారణాన్ని మాత్రం వారి కుటుంబ సభ్యులు తెలియజేయలేదు. త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం