Hanumakonda Crime: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా విడిపోయిన భార్యాభర్తలు కొందరైతే.. మరికొందరు చంపుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ మహిళ, తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేసింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
పచ్చని సంసారంలో చిచ్చు
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. దశాబ్దమున్నర కిందట అశోక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది యాదలక్ష్మి అనే మహిళ. ఈ జంటకు నలుగురు పిల్లలున్నారు. వారిలో ఇద్దరు కూతుళ్లు, మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. సంతానం పెద్దది కావడంతో సొంత గ్రామంలో ఉంటూ కూలీ పనులు చేస్తూ పిల్లలను చూసుకుంటోది యాదలక్ష్మి.
అయినా తెచ్చిన డబ్బులు చాలకపోవడంతో హైదరాబాద్‌కి మకాం మార్చాడు యాదలక్ష్మి భర్త అశోక్. ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు అశోక్. వారానికి ఒకసారి ఇంటికి వెళ్లివెచ్చేవాడు. రీసెంట్‌గా దసరా పండగ కోసం గ్రామానికి వెళ్లాడు అశోక్. నాలుగురోజులు అక్కడే ఉన్నాడు. ఈలోగా భార్య ప్రవర్తనను దగ్గరుండి గమనించాడు. కొందరితో భార్య క్లోజ్‌గా మూవ్ అవ్వడం గమనించాడు.
ఫ్యామిలీకి దూరంగా ఉండడంతో
చివరకు అనుమానం వచ్చి భార్యని గట్టిగా నిలదీశాడు భర్త. ఓ వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అర్థమైంది. ఆ విషయం తెలిసి జీర్ణించుకోలేకపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, తాను దూరంగా ఉండడంతో భార్య ఇలా చేస్తుందని ఊహించుకోలేకపోయాడు. చివరకు భార్య వ్యవహారం పదేపదే గుర్తుకు రావడంతో తట్టుకోలేకపోయాడు. చివరకు భార్యతో వాగ్వాదానికి దిగాడు.
గురువారం మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో మళ్లీ గొడవకు దిగాడు. పరిస్థితి గమనించిన యాదలక్ష్మి.. భర్తపై దాడి చేసింది. కూతురి సహాయంతో భర్త మెడకు చీర బిగించి హత్య చేసింది. ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఫోన్ చేసి తన భర్త అశోక్‌ను చంపేశానని సమాచారమిచ్చింది భార్య, నిందితురాలు యాదలక్ష్మి.
ALSO READ: పట్టపగలు దారుణం.. విద్యార్థిని గొంతు కోసిన యువకుడు
ఈ ఘటన గురించి తెలుసుకున్న అశోక్ తండ్రి వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరి నలుగురు పిల్లల పరిస్థితి అంతుబట్టడం లేదు. యాదలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలిపోయారు నలుగురు పిల్లలు.