Hyderabad Crime: హైదరాబాద్ సిటీలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. అద్దెకున్న దంపతులు బూత్‌రూమ్‌లో వాటిని చూసి షాకయ్యారు. ఈ వ్యవహారం పోలీసుల వరకు చేసింది. చివరకు ఇంటి ఓనర్‌ని అరెస్టు చేశారు. దీనికి సహకరించిన ఎలక్ట్రీషియన్ పరారీలో ఉన్నాడు. అసలు మేటరేంటి?
బూత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు
పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేయడం చూస్తున్నాం. వాటివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా కనిపించడంతో చాలామంది సీక్రెట్ కెమెరాలను తొలగించారు. తాజాగా హైదరాబాద్‌లోని అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. హైదరాబాద్‌లోని మధురానగర్‌లోని ఓ అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపింది.
జవహర్‌నగర్‌లోని అశోక్ యాదవ్‌కు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్నారు దంపతులు. అద్దెకు దిగి దాదాపు ఏడాదిపైనే అవుతుంది. ఈనెల 4న బాత్‌రూమ్‌లో బల్బు పని చేయలేదని ఇంటి ఓనర్ దృష్టికి తెచ్చింది. ఎలక్ట్రీషియన్ ద్వారా బాగు చేయిస్తానని చెప్పాడు. ఆ తర్వాత బల్బు హోల్డర్‌ని బాగు చేయించాడు. ఆ సమయంలో ఎలక్ట్రీషియన్ చింటూతో కలిసి బాత్‌రూమ్‌లో బల్బు హోల్డర్‌లో సీసీ కెమెరా అమర్చాడు ఇంటి ఓనర్ అశోక్.
అద్దెకు దిగిన దంపతులు షాక్
ఈనెల 13న బల్బు హోల్డర్ నుంచి స్క్రూ కిందపడింది. చివరకు హోల్డర్ కూడా కిందికి వేలాడింది. లైట్ వెలిగినప్పుడు హోల్డర్ లోపల కెమెరా ఉందని గుర్తించాడు అద్దెకు ఉన్నవారు. ఈ విషయాన్ని ఇంటి ఓనర్ దృష్టికి తెచ్చాడు. ఎలక్ట్రీషియన్ ఆ పని చేసి ఉంటాడని ఆ జంటకు చెప్పాడు ఇంటి ఓనర్. అతడ్ని నిలదీయాలని భావించారు ఆ దంపతులు.
అతడిపై కేసు పెడితే తనకు ఇబ్బందులు వస్తాయని ఇంటి యజమాని చెప్పాడట. దీంతో దంపతులకు ఇంటి ఓనర్-ఎలక్ట్రీషియన్‌పై అనుమానాలు రెట్టింపు అయ్యాయి. దీంతో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ALSO READ: వికటించిన లవ్ మ్యారేజ.. చీరతో భర్తకు ఉరేసి చంపేసిన భార్య
ఇంటి యజమాని అశోక్‌ను అరెస్టు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటూ దృష్టిపెట్టారు. జీ ప్లస్ టూ బిల్డింగ్ కావడంతో ఒక ఫ్లోర్‌లో మూడు ఫ్యామిలీలు ఉంటున్నాయి. తమకు అలాంటి సమస్య రాలేదని మిగతా వాటిలో అద్దెకు ఉంటున్నవారు చెప్పారు. ప్రస్తుతం ఇంటి ఓవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. దీనిపై లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు.
బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు..!
హైదరాబాద్-మధురానగర్‌లోని ఓ అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరాల కలకలం
అద్దె ఇంట్లోని బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసిన యజమాని
జవహర్‌నగర్‌లోని అశోక్ ఇంట్లో అద్దెకు ఉంటున్న దంపతులు
ఎలక్ట్రీషియన్ చింటూతో కలిసి బాత్‌రూమ్‌లో బల్బు హోల్డర్‌లో… pic.twitter.com/ycKBeeFitF
— BIG TV Breaking News (@bigtvtelugu) October 17, 2025