Uppal Balu: ఉప్పల్ బాలు(Uppal Balu) పరిచయం అవసరం లేని పేరు. నిత్యం ఏదో ఒక వీడియో ద్వారా సోషల్ మీడియా వార్తలలో నిలిచే ఉప్పల్ బాలు తాజాగా ఒక ఇంటర్వ్యూలో సింగర్ బేబీ(Singer Baby) గురించి మాట్లాడారు. గతంలో ఈమె ఎన్నో అద్భుతమైన పాటలు పాడటంతో ఎంతోమంది ఈమె పట్ల ప్రశంసలు కురిపించారు అలాగే ఆమెను పొగుడుతూ సత్కారాలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం తనకు అవకాశాలు లేక ఎంతో ఇబ్బంది పడుతుందని, ఇలా టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి వారికి అవకాశాలు కల్పించాలని కోరారు. మట్టిలో మాణిక్యం అంటూ గతంలో ఆమె పట్ల ఎంతోమంది ప్రశంసించారు ఈమె పాడిన పాటలు ఖండాంతరాలు దాటి ఫేమస్ అయ్యాయి.
ఇచ్చిన వారికే అవకాశాలు…
ఇప్పుడు మాత్రం బేబక్కకు ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతుందని దయచేసి ఇలాంటి టాలెంట్ ఉన్నవాళ్లను గుర్తించి అవకాశాలు ఇవ్వాలని ఉప్పల్ బాలు కోరారు. అదేవిధంగా స్టార్ మాలో కానీ, ఈటీవీలో కానీ అవకాశాలు ఇచ్చిన వారికే ఇస్తున్నారు తప్పా, కొత్తవారిని ప్రోత్సహించడం లేదని తెలిపారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో(Dhee Dance Show) కార్యక్రమం పై స్పందించారు. తాజాగా ఢీ 20 అంటూ కొత్త సీజన్ ప్రారంభమైంది ఈ సీజన్లో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తే వారు కూడా కెరియర్ లో మంచిగా ఎదుగుతారు అలా కాకుండా గత సీజన్లో చేసిన వారికే ఇప్పుడు కూడా అవకాశం ఇస్తున్నారని మండిపడ్డారు.
డాన్స్ చేయడం మాకు వచ్చు…
ఇలా ఇచ్చిన వారికే అవకాశాలు ఇస్తుంటే ప్రతిసారి మేము వారి డాన్సులు చూస్తూనే ఉండాలా? వారి మొహాలు చూడలేక చచ్చిపోతున్నాం. ఏం వారిలాగా మేము కూడా డాన్సులు చేస్తాం వాళ్లకంటే కూడా ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తామని, మాలాంటి వారికి కూడా అవకాశాలు ఇవ్వచ్చు కదా అంటూ మాట్లాడారు. ఇలా తీసుకున్న వారిని తీసుకోకుండా కొత్త వారికి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఉప్పల్ బాలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో మాత్రమే కాదు బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలోకి కూడా తీసుకున్న వారిని తిరిగి కంటెస్టెంట్లుగా తీసుకుంటున్నారని తెలిపారు. బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రస్తావన రావడంతో మీరు కూడా బిగ్ బాస్ లోకి వెళ్తున్నారా? అనే ప్రశ్న ఎదురైంది.
బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉప్పల్ బాలు…
ఈ ప్రశ్నకు ఉప్పల్ బాలు సమాధానం చెబుతూ .. తన పేరు కూడా ఉంది అవకాశం ఇస్తే ఎంతో అదృష్టంగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొంటానని, అవకాశం వస్తుందో? లేదో? ఎదురు చూడాలి అంటూ ఈ సందర్భంగా బిగ్ బాస్ కార్యక్రమం పై ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఇప్పటికే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ లిస్టులో ఉప్పల్ బాలు పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. మరి ఈయన ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా వెళ్తున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ కార్యక్రమం సెప్టెంబర్ 7వ తేదీ ప్రసారం కాబోతుందని వార్తలు వస్తున్నాయి కానీ అధికారకంగా వెల్లడించలేదు.
Also Read: ఇదంతా వాడి పనే… డ్రగ్స్ వ్యవహారంపై లావణ్య క్లారిటీ!