Illu Illalu Pillalu Today Episode September 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. చెంబుతో పాటుగా ఖరీదైన నగలు పోయాయి ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటారు. శ్రీవల్లి మాత్రం కూల్ గా వచ్చి ఆ నగలను పెట్టుకొని అదృష్టం నాకు లేదు పోతే పోనివ్వండి ఏం చేద్దామని బాధపడుతుంది. ఆ తర్వాత ఆనందరావు కూడా నువ్వేం బాధపడకమ్మా ఎదవ నగలు పోతే పోయినయి అని అంటాడు. కానీ రామరాజు మాత్రం అవేమైనా చిన్నాచితక వస్తువుల నగలు లక్షలు ఖరీదు చేసే నగలు అని అంటాడు. దొంగతనం వెనుక ఏదో కుట్ర ఉంది నాకు అర్థమవుతుంది. కచ్చితంగా నగలను దొంగతనం చేసిన వ్యక్తిని నేను కచ్చితంగా పట్టుకుంటాను అని రామరాజు చాలెంజ్ చేస్తాడు.. నగలను ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాను అని రామరాజు అనడంతో ఆనందరావు శ్రీవల్లిలకు దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపిస్తుంది.. భాగ్యం ప్లాన్ తో అంతా సేఫ్… శ్రీవల్లికి ప్రేమ పై అనుమానం మొదలవతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ప్రోమో విషయానికోస్తే.. ప్రేమకి ఒక కొరియర్ వస్తుంది. అది తీసుకున్న శ్రీవల్లి ప్రేమకి బొకే ఇచ్చారు ఏంటి? అందులో వన్ వీక్ అని రాసి ఉందని అనుకుంటుంది. ఈ విషయాన్ని వెళ్లి ప్రేమని అడుగుతుంది ప్రేమ చెప్పిన సమాధానం పై శ్రీవల్లికి అనుమానం వస్తుంది. ప్రేమ ఏదో పెద్ద మ్యాటర్ ని దాసిపెడుతుంది. అదేంటో కనిపెట్టి ప్రేమకు చుక్కలు చూపించాలి అని శ్రీవల్లి అనుకుంటుంది.
శ్రీవల్లికి అనుమానం మొదలవుతుంది. ప్రేమ మాత్రం శ్రీవల్లిని బయటకి పంపేసి తలుపు వేస్తుంది.. మొన్న సీక్రెట్ గా ఏదో లెటర్ వచ్చిందని దాల్చింది. ఈ బొకే పంపించడానికి ఏదో ఉంది అని ఆలోచిస్తుంది. ప్రేమ బొకేను చూసి షాక్ అవుతుంది. అప్పుడే కళ్యాణ్ ఫోన్ చేసి బొకే అందిందా నీకు నచ్చిందా అని అడుగుతాడు. మరి నువ్వు ఇలాంటి పంపించి నన్ను ఇది చేయాలని చూస్తున్నావా అని ప్రేమ అడుగుతుంది. అయితే నువ్వు బొకే పంపిస్తే అస్సలు నమ్మట్లేదు కదా నీకు అదిరిపోయే దిమ్మ తిరిగే వీడియో ఒకటి పంపిస్తాను చూసి ఎంజాయ్ చెయ్ బేబీ అని అంటాడు.
వాళ్ళిద్దరూ ఫోటో గదిలో ఉన్న వీడియోని ప్రేమకు పంపిస్తాడు అది చూసి షాక్ అవుతుంది. అప్పుడే ఇంట్లో వస్తాడు ప్రేమను అలా చూసి ఏమైందని అడుగుతాడు. కానీ ప్రేమ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నువ్విలా ఉండడం నాకు నచ్చట్లేదు ప్రేమ నువ్వు నీలాగే ఉంది అని బయటికి తీసుకెళ్తాడు. నాకు కూడా చెప్పుకోలేని సమస్యతో నువ్వు బాధపడుతున్నావు అని అర్థమవుతుంది. అదేంటో నాకు కొంచెం కొంచెం అన్న చెప్పు నీ సమస్యని నేను తీరుస్తాను అని హామీ ఇస్తాడు.
ప్రేమ ఎంత అడిగినా కూడా చెప్పకూడదు మౌనంగా ఉండిపోతాడు.. ధీరజ్ దగ్గరికి చందు వచ్చి నువ్వు చేసిన సహాయాన్ని అసలు మర్చిపోలేను రా.. ఇంతకీ ఆ లక్ష రూపాయలు ఎవరి దగ్గర తీసుకున్నావో చెప్పు అని చందు అడుగుతాడు. కానీ ధీరజ్ మాత్రం మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అన్నయ్య నువ్వేం టెన్షన్ పడకు నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని చెందుతూ అంటాడు.
అటు సాగర్ ని మంచిగా రెడీ చేసి దేవుడి దగ్గరికి తీసుకొస్తుంది నర్మదా. ఎప్పుడు లెండి పూజ గదిలోకి వెళ్లి పూజ చేసి మరి సాగర్ ని ఎక్కడ తీసుకెళ్తుంది అబ్బా అని శ్రీవల్లి ఆలోచిస్తుంది. అంతే కాదు అనుమానం కూడా మొదలవుతుంది.. అయితే మొత్తానికి శ్రీవల్లి నర్మదా సాగర్ లో గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. హాల్ టికెట్ ను శ్రీవల్లి తీసుకొని రామరాజుకు ఇస్తుందేమో చూడాలి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.. సోమవారం ఎపిసోడ్ మాత్రం కాస్త ఆసక్తిగా ఉండబోతుందని తెలుస్తుంది..