BigTV English
Advertisement

Lavanya: ఇదంతా వాడి పనే… డ్రగ్స్ వ్యవహారంపై లావణ్య క్లారిటీ!

Lavanya: ఇదంతా వాడి పనే… డ్రగ్స్ వ్యవహారంపై లావణ్య క్లారిటీ!

Lavanya: సినీ నటుడు రాజ్ తరుణ్(Raj Tarun), లావణ్య(Lavanya) వివాదం మళ్లీ మొదటికి వచ్చిందని తెలుస్తోంది. రాజ్ తరుణ్ లావణ్య అనే అమ్మాయితో చాలా సన్నిహితంగా ఉండటమే కాకుండా తనని ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారని అయితే ఇప్పుడు వేరే వారిపై ప్రేమతో తనని వదిలేస్తున్నారంటూ గతంలో పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఇలా ఈమె చేసిన ఆరోపణలు అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక ఈ ఆరోపణలు నటుడు రాజ్ తరుణ్ కెరియర్ పై కూడా కోలుకోలేని దెబ్బ కొట్టాయని చెప్పాలి. ఇలా కొన్నాళ్లపాటు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని సైలెంట్ కావడంతో వీరి వివాదం ముగిసిందని అందరూ బాధిచారు. అయితే ఉన్నఫలంగా లావణ్యకు సంబంధించిన కొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి.


డ్రగ్స్ దందా.

తాజాగా లావణ్యకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా ఆమె డ్రగ్స్(Drugs) దందా నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియోలో భాగంగా లావణ్య ఒక ప్యాకెట్ చూయిస్తూ ఆ ప్యాకెట్ పుస్తకంలో పెడుతూ కనిపించారు. అలాగే మరొక ప్యాకెట్ కళ్ళజోడు డబ్బాలో పెట్టమని చెబుతున్నట్టు ఉంది. ఈ వీడియో ఆడియో ఆధారంగా ఈమె తిరిగి డ్రగ్స్ దందా నిర్వహిస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గతంలో కూడా ఈమె డ్రగ్స్ కేసులో దొరికిపోవడంతో, కచ్చితంగా డ్రగ్స్ దందా తిరిగి ప్రారంభించిందని వార్తలు వస్తున్న తరుణంలో లావణ్య స్పందించారు.


నాపై కుట్ర చేస్తున్నారు..

తాజాగా లావణ్య సోషల్ మీడియా వేదికగా తన గురించి వస్తున్నటువంటి ఆరోపణల పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోలో భాగంగా లావణ్య మాట్లాడుతూ…” అందరికీ నమస్కారమండి. నాకు సంబంధించిన కొన్ని ఆడియోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో తాను మస్తాన్ సాయి(Mastan Sai) పై హార్డ్ డిస్క్ లకు సంబంధించి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి ఆడియోలు వీడియోలను ఇప్పుడు విడుదల చేస్తూ ఉద్దేశపూర్వకంగా నాపై కుట్రకు పాల్పడుతున్నారని తెలిపారు”.

“ప్రస్తుతం తాను బాగున్నానని, ఇలాంటి వ్యవహారాలన్నింటికీ కూడా తాను దూరంగా ఉన్నానని, కేవలం ఉద్దేశపూర్వకంగానే వీటిని విడుదల చేశారు ఇవన్నీ కూడా పాత వీడియోలు, దయచేసి ఎవరూ కూడా ఈ వీడియోలు నిజమని నమ్మొద్దు.. వాటికి నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు థాంక్యూ” అంటూ లావణ్య వీడియోని విడుదల చేశారు. అయితే రాజ్ తరుణ్ , మస్తాన్ సాయి వంటి వారితో తనకు గతంలో ఉన్న విభేదాల కారణంగానే ప్రస్తుతం ఇలాంటి వీడియోల బయటకు విడుదల చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి లావణ్య చేసిన ఈ వ్యాఖ్యలపై మస్తాన్ సాయి స్పందన ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా వీరి వివాదం ముగిసిందనే లోపు మరోసారి తెరపైకి రావడంతో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Also Read: Anil Ravipudi:  నేనూ రామాయణం తీస్తానంటున్న అనిల్ రావిపూడి.. ఇంకెంత మంది తీస్తారయ్యా?

Related News

Upcoming Movies Theater: నవంబర్ లో సినిమాల సందడి.. ఆ ఒక్కటిపైనే ఫోకస్..

Guess The Actress : గుర్తు పట్టలేనంతగా మారిపోయిన లవర్ బాయ్.. ఇంత మార్పేంటన్నా..?

Venky Trivikram : సినిమా ఫస్ట్ షెడ్యూల్ అప్పుడే, వెంకటేష్ తో శ్రీనిధి కీలక సీన్స్

Rahul Ravindran: అత్తారింటికి దారేది సినిమా రిజెక్ట్ చేశాను, అంత ఇంపార్టెంట్ పాత్ర ఏంటి?

Deepika Padukone: దీపికాకు మరో షాక్ ఇచ్చిన కల్కి టీమ్.. ఇంత పగ పట్టారేంటీ?

Ravi Teja : చిరంజీవి దర్శకుడితో రవితేజ సినిమా, డిస్కషన్స్ జరుగుతున్నాయి 

Suriya: మరో తెలుగు డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య, ప్రొడ్యూసర్ గా దిల్ రాజు

SYG : సంబరాల ఏటిగట్టు సినిమా కాన్సెప్ట్ ఇదే, తమిళ్ దర్శకుల నుంచి ఇన్స్పైర్ అయ్యారా?

Big Stories

×